Article 370: యామీ గౌతమ్‌కు షాక్.. అక్కడ ఆర్టికల్ 370 సినిమాపై నిషేధం.. కారణమేమిటంటే?

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్‌ 370’. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ పరిస్థితుల ఆధారంగాఆదిత్య సుహాస్‌ జంభాలె ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో యామీ గౌతమ్ ఓ పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది. అలాగే టాలీవుడ్ అందాల తార ప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది.

Article 370: యామీ గౌతమ్‌కు షాక్.. అక్కడ ఆర్టికల్ 370 సినిమాపై నిషేధం.. కారణమేమిటంటే?
Article 370 Movie
Follow us

|

Updated on: Feb 26, 2024 | 8:27 PM

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్‌ 370’. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ పరిస్థితుల ఆధారంగాఆదిత్య సుహాస్‌ జంభాలె ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో యామీ గౌతమ్ ఓ పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది. అలాగే టాలీవుడ్ అందాల తార ప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే తాజాగా ఆర్టికల్ 370 సినిమాపై గల్ఫ్‌ దేశాలన్నీ నిషేధం విధించాయి. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయడంపై స్పష్టమైన కారణాలు లేనప్పటికీ ఇందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, అందుకే ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు భారతీయ సినిమాలకు గల్ఫ్ దేశాల్లో విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హృతిక్ రోషన్ ఫైటర్ పై కూడా గల్ఫ్‌ దేశాలు నిషేధం విధించాయి. యూఏఈ మినహా ఎక్కడా కూడా ‘ఫైటర్‌’ను ప్రదర్శించలేదు. ఇప్పుడు ఆర్టికల్ 370 కూడా ఈ బ్యాన్ జాబితాలో చేరింది. మరోవైపు ఈ మూవీ కలెక్షన్ బాక్సాఫీస్ వద్ద మంచి రాబడుతోంది . అందుకు నటి యామీ గౌతమ్ సంతోషం వ్యక్తం చేసింది.

‘ఆర్టికల్ 370′ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజు 6.12 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. అయితే శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు బాగున్నాయి. రోజురోజుకు వసూళ్లు పెరుగుతుండడంతో చిత్రబృందంలో ఆశలు చిగురించాయి. రెండో రోజు అంటే ఫిబ్రవరి 24న ‘ఆర్టికల్ 370’ సినిమా 9.08 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు (ఫిబ్రవరి 25) ఆదివారం కాబట్టి వసూళ్లు పెరిగాయి. ఫిబ్రవరి 25న ఈ సినిమా 10.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ గా ఈ సినిమా కలెక్షన్స్ ఎంతవరకు రాబడుతుందో వేచి చూడాలి. ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్ ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రను పోషించారు. అతని లుక్ అందరినీ ఆకర్షించింది. నటి యామీ గౌతమ్ ఈ చిత్రం మంచి కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో రాసింది. మూడు రోజుల విదేశీ ఆదాయాలు కలుపుకుంటే రూ.34.71 కోట్లు అవుతుందని తెలిపారు. ఆర్టికల్ 370 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చదని అన్నారు. భాషలో సాంకేతిక అంశాలు, రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కానీ మేము ధైర్యంగా పని కొనసాగించాము. ఎందుకంటే వారు మన ప్రేక్షకుల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని మాకు తెలుసు. నేసేయర్స్ తప్పు అని నిరూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని యామీ గౌతమ్ పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.