AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా? క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్.. స్టార్ హీరోలతో హిట్లు

ఈ ఫొటోలో ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్న వ్య‌క్తిని గుర్తుపట్టారా? ఆయన టాలీవుడ్‌లో ఒక స్టార్ డైరెక్ట‌ర్‌. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఇలా స్టార్ హిట్ లతో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. కేవలం డైరెక్టర్ గానే కాదు నిర్మాత గానూ సత్తా చాటాడు. ఆయనే కాదు తన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్లుగా చెలామణి అవుతున్నారు.

Tollywood: ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా? క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్.. స్టార్ హీరోలతో హిట్లు
Tollywood Director
Basha Shek
|

Updated on: Feb 25, 2024 | 9:50 PM

Share

ఈ ఫొటోలో ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్న వ్య‌క్తిని గుర్తుపట్టారా? ఆయన టాలీవుడ్‌లో ఒక స్టార్ డైరెక్ట‌ర్‌. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఇలా స్టార్ హిట్ లతో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. కేవలం డైరెక్టర్ గానే కాదు నిర్మాత గానూ సత్తా చాటాడు. ఆయనే కాదు తన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్లుగా చెలామణి అవుతున్నారు. త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీ సీక్వెల్ తో మన మందుకు వస్తున్నాడు. ఇంతకీ ఆయనెవరో గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసే వారు సులభంగా గుర్తుపట్టవచ్చు. ఆయన మరెవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన స్టార్ డైరెక్టర్ సుకుమార్‌. ఈ ఫొటోలో డైరెక్టర్ పక్కన ఉన్నది ఆయన సతీమణి తబిత. వీరికి పాప సుకృతివేణి, బాబు సుక్రాంత్ సంతానం. ఇదిలా ఉంటే సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో ఈ ఫొటో షేర్ చేసింది. 2004లో దిగిన ఫొటోను ఈ ఏడాది దిగిన ఫొటోను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మీ ప్రేమను పొందడం ఎంత మధురమో’ అని భర్తపై తనకున్న ప్రేమను చాటుకుంది తబిత. దీనికి 20 ఏళ్ల ప్రయాణం అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది.

ప్రస్తుతం సుకుమార్ భార్య షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో సుకుమార్ లుక్ ని చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వాట్ ఏ చేంజ్, మేకోవర్ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాను తీస్తున్నాడు సుకుమార్. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక మందన్నా, సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ, జగదీష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుకుమార్ భార్య బబిత..

 డైరెక్టర్ సుకుమార్ లేటెస్ట్ ఫొటో..

భార్యతో సుకుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..