Mahesh Babu: ఈ క్రేజ్ ఏంటి సామీ.. ఫోన్ పేలో మహేశ్.. 5 సెకన్ల వాయిస్‌కు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

సాధారణంగా ఫోన్‌ పే నుంచి నగదు లావాదేవీలు చేసే టప్పుడు.. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే త్వరలోనే ఆ వాయిస్ స్థానంలో మహేశ్ స్వీట్‌ వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం ఫోన్‌ పే ప్రతినిధులు మహేశ్‌ వాయిస్ శాంపిల్స్ తీసుకుని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారట.

Mahesh Babu: ఈ క్రేజ్ ఏంటి సామీ.. ఫోన్ పేలో మహేశ్.. 5 సెకన్ల వాయిస్‌కు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Feb 24, 2024 | 2:08 PM

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్లు ఎలా పోటీ పడతారో యాడ్స్, ప్రకటనలు చేసేందుకు కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి. అలా తాజాగా మరో ప్రముఖ సంస్థకు అంబాసిడర్ గా మారిపోయారు మహేశ్‌ బాబు. డిజిటల్ మనీ ట్రాన్సఫర్ యాప్‌, ఫోన్‌ పే యూపీఐకు తన గొంతును అరువుగా ఇచ్చేశారీ సూపర్ స్టార్‌. సాధారణంగా ఫోన్‌ పే నుంచి నగదు లావాదేవీలు చేసే టప్పుడు.. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే త్వరలోనే ఆ వాయిస్ స్థానంలో మహేశ్ స్వీట్‌ వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం ఫోన్‌ పే ప్రతినిధులు మహేశ్‌ వాయిస్ శాంపిల్స్ తీసుకుని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారట. తెలుగులో మహేశ్ బాబు వాయిస్‌లాగానే ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా ఫోన్ పే అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, కన్నడ భాషలో కిచ్చా సుదీప్‌, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో ఫోన్ పే చర్చలు జరిపిందట. ఉదాహరణకు.. ఫోన్ పేలో చెల్లింపు చేస్తే.. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ మహేశ్ బాబు చెబుతాడట. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఇది కొత్త‌గా వ‌చ్చింది కాదు. గతంలో బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఇదే తరహాలో వాయిస్‌ను అందించారు.

అయితే ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం చెల్లించారట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారంతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు మహేశ్ బాబు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇది సుమారు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాలో నటిస్తున్నాడు మహేశ్ బాబు.

ఇవి కూడా చదవండి

ఫోన్ పేకు థ్యాంక్స్ చెప్పిన మహేశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!