Movie Tickets: సినిమా లవర్స్ కు బంపరాఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇవే

సినీ లవర్స్ డే (ఫిబ్రవరి 23) పురస్కరించుకుని శుక్రవారం మూవీ లవర్స్‌ కు బంపరాఫర్‌ ప్రకటించారు మల్టీప్లెక్స్‌ థియేటర్ ఓనర్లు. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ఛైన్స్ అన్నింటిలో టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. అంటే ఫిబ్రవరి 23న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 99లకే సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది

Movie Tickets: సినిమా లవర్స్ కు బంపరాఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇవే
Movie Tickets
Follow us
Basha Shek

|

Updated on: Feb 23, 2024 | 12:40 PM

సినీ లవర్స్ డే (ఫిబ్రవరి 23) పురస్కరించుకుని శుక్రవారం మూవీ లవర్స్‌ కు బంపరాఫర్‌ ప్రకటించారు మల్టీప్లెక్స్‌ థియేటర్ ఓనర్లు. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ఛైన్స్ అన్నింటిలో టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. అంటే ఫిబ్రవరి 23న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 99లకే సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ టికెట్‌ ధర అన్ని మల్టీప్లెక్స లకు, అలాగే అన్ని సినిమాలకు వర్తించదని మల్లీప్లెక్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇటీవల విడుదలైన ‘ఆల్ ఇండియా ర్యాంక్’, ‘ఆర్టికల్ 370’, ‘క్రాక్’, ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’, ‘ఫైటర్’లాంటి బాలీవుడ్ చిత్రాలను రూ.99 టికెట్ ధరకే చూడవచ్చని మల్టీప్లెక్స్‌లు ప్రకటించాయి. అలాగే ‘మేడం వెబ్’, ‘ది హోల్డ్ ఓవర్స్’, ‘బాబ్ మార్లీ – వన్ లవ్’, ‘మీన్ గర్ల్స్’, ‘ది టీచర్స్ లాంజ్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు కూడా పీవీఆర్‌లో ఇంతే టికెట్ ధర ఉంది. సాధారణ సీట్లకు మాత్రమే కాదు.. రిక్లైనర్ సీట్ల విషయంలో టికెట్ల ధరలను తగ్గించింది పీవీఆర్ ఐనాక్స్. రూ.199లు ఉన్న రిక్లైనర్ సీట్స్ ఇప్పుడు కేవలం రూ.99లకే అందుబాటులో ఉన్నాయి. కేవలం పీవీఆర్ మాత్రమే ఐమ్యాక్స్, 4డీఎక్స్, ఎమ్ఎక్స్4డీ ఫార్మాట్స్‌లో సినిమా చూడాలని అనుకున్నవారికి కూడా ఈ డిస్కౌంట్ ధరలు వర్తించనున్నాయి. అయితే కేవలం శుక్రవారం ఒక్కరోజు మాత్రమే రూ. 99 లకి టికెట్ ఆఫర్ ఉండనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?

ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఈ బంపరాఫర్‌ వర్తిస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం పీవీఆర్ ఐనాక్స్‌ లో రూ. 112 కు మల్టీప్లెక్స్ టికెట్లను విక్రయిస్తున్నారు. అయితే ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. గత వారం రిలీజైన సందీప్ కిషన్‌ ఊరు పేరు భైరవ కోన సినిమాకు మాత్రమే పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. మరి రూ.99ల మల్టీప్లెక్స్ మూవీ టికెట్ ఆఫర్‌ తో శుక్రవారం నాడు ఎంతమంది సినిమా థియేటర్లకు క్యూ కడతారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.