AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీకి మళ్లీ గడ్డు కాలం తప్పదా? కింగ్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడో చెప్పేసిన ప్రముఖ జ్యోతిష్యుడు

అనుష్క శర్మ ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు అకాయ్‌ అని పేరు కూడా పెట్టారు. ఫిబ్రవరి 20న కోహ్లి, అనుష్క ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేశారు. విరాట్ కోహ్లీ త్వరలో క్రికెట్ మైదానంలోకి వస్తాడని భావిస్తున్నారు. దీంతో అభిమానులు కూడా ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. అయితే ఇలాంటి శుభపరిణామాల మధ్య..

Virat Kohli: కోహ్లీకి మళ్లీ గడ్డు కాలం తప్పదా?  కింగ్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడో  చెప్పేసిన ప్రముఖ జ్యోతిష్యుడు
Virat Kohli
Basha Shek
|

Updated on: Feb 22, 2024 | 6:45 PM

Share

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటున్నాడు. తన భార్య అనుష్క పండంటి మగ బిడ్డను ప్రసవించడంతో ప్రస్తుతం ఆమెకు తోడుగా ఉంటున్నాడు. అనుష్క శర్మ ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు అకాయ్‌ అని పేరు కూడా పెట్టారు. ఫిబ్రవరి 20న కోహ్లి, అనుష్క ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేశారు. విరాట్ కోహ్లీ త్వరలో క్రికెట్ మైదానంలోకి వస్తాడని భావిస్తున్నారు. దీంతో అభిమానులు కూడా ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. అయితే ఇలాంటి శుభపరిణామాల మధ్య విరాట్ కోహ్లీ జాతకం గురించి ఓ ప్రముఖ జ్యోతిష్యుడు గతంలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. కోహ్లి గురించి ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి. 2016లో షేర్‌ చేసిన ఈ పోస్ట్‌లో 2024, 2025లో కోహ్లీకి ఏం జరుగుతుందో కూడా రాసి ఉంది. ఈ పోస్ట్ ప్రకారం ఆగస్టు 2025 నుండి ఫిబ్రవరి 2027 వరకు కోహ్లీకి గడ్డు కాలం తప్పదని, పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులు పడతాడని ఉంది. 2027లో విరాట్ కోహ్లి కెరీర్ మళ్లీ శిఖరాగ్రానికి చేరుకుంటుందని, 2028 మార్చిలో అతను రిటైర్ అవుతాడని సదరు జ్యోతిష్యుడు చెప్పుకొచ్చాడు.

కోహ్లి ఎప్పుడు స్టార్ డమ్‌, అనుష్కతో పెళ్లి, పిల్లలు, బ్యాడ్‌ ఫామ్.. వీటి విషయాలపై ‘స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ’ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరంగా ఇవన్నీ నిజమయ్యాయి. 2021-24 మధ్య కోహ్లి మరోసారి తండ్రయ్యే అవకాశం ఉందని కూడా ఇందులో ఉంది. ఇప్పుడు అది కూడా వాస్తవ రూపం దాల్చింది. మరి ఆ ప్రముఖ జ్యోతిష్యుడు అంచనా వేసినట్లే కోహ్లీకి మళ్లీ గడ్డుకాలం తప్పదా? ఇదే ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

విరాట్ జాతకం…

విరాట్ కోహ్లీ ట్వీట్..

జూనియర్ కోహ్లీ వచ్చేశాడోచ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..

మరిన్ని తాజా  క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..