Vidya Balan: విద్యాబాలన్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్లు.. భారీ వసూళ్లు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మాయా ప్రపంచం. ఇక్కడ పని చేసి స్టార్టుగా వెలుగొందాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకుని చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లను వాడుతూ ఛీటింగ్‌ చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ పేరును ఇలాగే దుర్వినియోగం చేశారు. ఇప్పుడు విద్యాబాలన్ పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు.

Vidya Balan: విద్యాబాలన్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్లు.. భారీ వసూళ్లు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌
Actress Vidya Balan
Follow us
Basha Shek

|

Updated on: Feb 21, 2024 | 2:54 PM

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మాయా ప్రపంచం. ఇక్కడ పని చేసి స్టార్టుగా వెలుగొందాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకుని చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లను వాడుతూ ఛీటింగ్‌ చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ పేరును ఇలాగే దుర్వినియోగం చేశారు. ఇప్పుడు విద్యాబాలన్ పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె పేరుతో జరుగుతోన్న మోసాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్‌ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ దారుణం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యాబాలన్ పపోలీసులను ఆశ్రయించింది. చాలా రోజులుగా జరుగుతున్న మోసం గురించి నటికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి..

బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ విద్యాబాలన్. తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిందామె. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఈ నేపథ్యంలోనే ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దుండగులు ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. విద్యాబాలన్ పేరును చెడగొడుతున్నారు. ప్రజల నుంచి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో దుండగులు ఈ- మెయిల్ ఖాతాను కూడా తెరిచారు. దాని ద్వారా చాలా మందికి సందేశం పంపాడు. సినీ పరిశ్రమలోని ప్రముఖులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా విద్యాబాలన్ పేరుతో మోసం జరుగుతోందని ఓ కాస్ట్యూమ్ డిజైనర్‌కు తెలిసింది. ఆ విషయాన్ని నటికి తెలిజేశారు. దీంతో విద్యాబాలన్ వెంటనే మేల్కొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే విద్యాబాలన్ ఇటీవల కాలంలో జాగ్రత్తగా మూవీస్‌ ను ఎంపిక చేసుకుంటోంది. కథ నచ్చితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ‘భూల్ భూలయ్య 3’ చిత్రానికి సంతకం చేసింది.. 2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భూల్ భూలయ్య’లో ప్రధాన పాత్ర పోషించిన విద్య సీక్వెల్ లో  మాత్రం మిస్ అయ్యింది. ఇప్పుడు ‘భూల్‌ భూలయ్య 3’ సినిమాతో భయపెట్టేందుకు రెడీ అవుతోందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..