Lal Salaam OTT: ఓటీటీలో రజనీకాంత్ ‘లాల్‌ సలామ్‌’.. అనుకున్న తేదీ కంటే ముందుగానే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న రిలీజైన లాల్‌ సలామ్ కు మిక్స్‌ డ్ టాక్‌ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నెగెటివ్‌ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద లాల్ సలామ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. థియేటర్లలో ఆడియెన్స్‌ ను నిరాశపర్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన టాక్‌ నడుస్తోంది. అనుకున్న తేదీ కంటే ముందుగానే రజనీకాంత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందట

Lal Salaam OTT: ఓటీటీలో రజనీకాంత్ 'లాల్‌ సలామ్‌'.. అనుకున్న తేదీ కంటే ముందుగానే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Lal Salaam Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 20, 2024 | 6:36 PM

జైలర్‌ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్‌ సలామ్‌. రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన ఈ స్టోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, జీవితా రాజశేఖర్‌ ఇతర రోల్స్ లో మెరిశారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న రిలీజైన లాల్‌ సలామ్ కు మిక్స్‌ డ్ టాక్‌ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నెగెటివ్‌ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద లాల్ సలామ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. థియేటర్లలో ఆడియెన్స్‌ ను నిరాశపర్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన టాక్‌ నడుస్తోంది. అనుకున్న తేదీ కంటే ముందుగానే రజనీకాంత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందట. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లాల్ సలామ్‌ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. రజనీకాంత్ క్రేజ్ దృష్ట్యా ఇందుకోసం మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్ కుదిరినట్లు టాక్‌ నడుస్తోంది. ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట.

అయితే ప్రస్తుతం థియేటర్లలో లాల్‌ సలామ్‌ కు పెద్దగా రెస్పాన్స్ లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే రజనీ కాంత్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. మార్చి మొదటి వారంలోనే లాల్ సలామ్ స్ట్రీమింగ్ కు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సామాజిక మాధ్యమాల్లో టాక్‌ నడుస్తోంది. ఒక వేళ మొదటి వార కుదరకపోయినా రెండో వారంలోనైనా రజనీ సినిమా ఓటీటీలోకి వస్తుందని టాక్ నడుస్తోంది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు.ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు. ఒక గ్రామంలో జరిగిన హిందూ- ముస్లిం గొడవలకు కాస్త క్రికెట్ నేపథ్యాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు రజనీకాంత్ ఐశ్వర్య. అందించడం విశేషం ఇందులో మొయీద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

ఇవి కూడా చదవండి

blockquote class=”twitter-tweet”>

Anticipation peaks! 🔥 Lal Salaam is running successfully and setting the screens on fire. 💥🎬#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran @gkmtamilkumaranpic.twitter.com/KQnrne6wCR

— Lyca Productions (@LycaProductions) February 11, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి