AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: ‘ఆ ప్రశ్నలే అడుగుతున్నారు’.. లావణ్యతో పెళ్లయ్యాక లైఫ్‌లో వచ్చిన మార్పులు చెప్పేసిన వరుణ్‌ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ గతేడాది నవంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరూ ఏకమయ్యారు. పెళ్లి తర్వాత చాలా రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉన్న వరుణ్, లావణ్యలు మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్ లో బిజీ కానున్నారు. త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వరుణ్‌ తేజ్‌

Varun Tej: 'ఆ ప్రశ్నలే అడుగుతున్నారు'.. లావణ్యతో పెళ్లయ్యాక లైఫ్‌లో వచ్చిన మార్పులు చెప్పేసిన వరుణ్‌ తేజ్
Varun Tej Family
Basha Shek
|

Updated on: Feb 18, 2024 | 11:48 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ గతేడాది నవంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరూ ఏకమయ్యారు. పెళ్లి తర్వాత చాలా రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉన్న వరుణ్, లావణ్యలు మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్ లో బిజీ కానున్నారు. త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వరుణ్‌ తేజ్‌.శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్‌ హీరోయిన్ గా నటించింది. వైమానిక దళ వీరుల ధైర్య సాహసాలను, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటోన్న సవాళ్ల నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ ను తెరకెక్కించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో సందడి చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పెళ్లి తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటని స్టార్ యాంకర్‌ సుమ వరుణ్ ని అడిగింది. దీనికి ‘ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కడికెళ్తున్నావనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని ‘ నవ్వుతూ సమాధానమిచ్చాడు మెగా ప్రిన్స్‌. అలాగే మరో ప్రశ్నకు ఈ ఏడాది వేలంటైన్స్ డే కు తన భార్య లావణ్య త్రిపాఠి ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వలేదన్నాడు. అయితే ఇద్దరూ విహార యాత్రకు వెళ్లామన్నారు.

ఆపరేషన్ వేలంటైన్ సినిమా విషయానికి వస్తే.. సోనీపిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని ఈ సినిమాను నిర్మించారు. నవదీప్, రుహాణి శర్మ, మీర్ సర్వార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ తో పాటు రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మార్చి 1న గ్రాండ్ గా తెలుగుతో పాటు హిందీ లోనూ గ్రాండ్ గా ఆపరేషన్ వేలంటైన్ రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తోన్న వరుణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి