True Lover OTT: ఓటీటీలోకి అందమైన ప్రేమకథా చిత్రం .. ‘ట్రూ లవర్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

యంగ్ హీరో, హీరోయిన్లు మ‌ణికంద‌న్‌, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన లేటెస్ట్‌ రొమాంటిక్ లవ్‌ స్టోరీ ట్రూ లవర్‌. . త‌మిళంలో ల‌వ‌ర్ పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో ట్రూ ల‌వ‌ర్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ప్రముఖ డైరెక్ట‌ర్ మారుతి, బేబీ ప్రొడ్యూస‌ర్ ఎస్‌కేఎన్ . యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌భురామ్ వ్యాస్ ట్రూ లవర్‌ను తెర‌కెక్కించాడు.

True Lover OTT: ఓటీటీలోకి అందమైన ప్రేమకథా చిత్రం .. 'ట్రూ లవర్' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
True Lover Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2024 | 8:28 PM

యంగ్ హీరో, హీరోయిన్లు మ‌ణికంద‌న్‌, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన లేటెస్ట్‌ రొమాంటిక్ లవ్‌ స్టోరీ ట్రూ లవర్‌. . త‌మిళంలో ల‌వ‌ర్ పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో ట్రూ ల‌వ‌ర్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ప్రముఖ డైరెక్ట‌ర్ మారుతి, బేబీ ప్రొడ్యూస‌ర్ ఎస్‌కేఎన్ . యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌భురామ్ వ్యాస్ ట్రూ లవర్‌ను తెర‌కెక్కించాడు. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. తమిళంలో అయితే రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ సినిమాను మించి వసూళ్లు రావడం గమనార్హం. తెలుగులోనూ గట్టిగా ప్రమోషన్లు నిర్వహించడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన ట్రూ లవర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా మూవీస్ లాగే ఈ సినిమా కూడా థియేటర్లలో రిలీజయ్యాక నెల రోజుల్లోపే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుందని టాక్‌ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ట్రూ లవర్‌ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 8 నుంచి ఈ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీని ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిమొదటి వారంలో ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.

ట్రూ లవర్‌ సినిమాలో కన్నా రవి, శరవణన్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. సీన్‌ రోల్డాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మ‌ణికంద‌న్‌), దివ్య (శ్రీగౌరిప్రియ‌) లవ్‌ చేసుకుంటారు. అయితే దివ్యను అనవసరంగా అనుమానిస్తుంటాడు అరుణ్‌. వేరొకరితో మాట్లాడినా అసలు సహించ లేదు. దీంతో దివ్య అతనికి బ్రేకప్‌ చెప్పాలని చాలా సార్లు అనుకుంటుంది. అదే సమయంలో తన స్నేహితులతో కలిసి టూర్‌ కు వెళ్లిన దివ్య వెంట అరుణ్ కూడా వెళతాడు. మరి అక్కడ ఏమైంది? అరుణ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ట్రూ లవర్‌ మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ట్రూ లవర్ సినిమా.. ఇంట్రెస్టింగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..