Devara: ఎన్టీఆర్‌ ‘దేవర’ వచ్చేది ఆ పండగకే.. కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మేకర్స్‌.. అదిరిపోయిన పోస్టర్

ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దేవర ఒకటి. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌లో జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్‌ స్టైలిష్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ దేవరపై అంచనాలను పెంచేశాయి.

Devara: ఎన్టీఆర్‌ 'దేవర' వచ్చేది ఆ పండగకే.. కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మేకర్స్‌.. అదిరిపోయిన పోస్టర్
Devara Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 16, 2024 | 5:15 PM

ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దేవర ఒకటి. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌లో జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్‌ స్టైలిష్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ దేవరపై అంచనాలను పెంచేశాయి. అలాగే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడంతో రోజురోజుకీ దేవరపై హైప్‌ పెరిగిపోతోంది. ఇదివరకే ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఏప్రిల్‌ 5న దేవర రిలీజ్ చేయనున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా దేవర వాయిదా పడుతుందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడదే నిజమయ్యింది. దేవర మూవీ ఏప్రిల్ 5న కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 10న రాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. దసరా పండగకు ముందు మూవీని తీసుకురానున్నట్లు చెప్పి మేకర్స్ ఆశ్చర్యపరిచారు. అంటే ముందు ప్రకటించిన తేదీ కంటేసుమారు ఆరు నెలలు ఆలస్యంగా దేవర రానుంది. కాగా గతంలో 2018లో ఎన్టీఆర్‌ నటించిన అరవింద సమేత మూవీ కూడా దసరాకు రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దేవర రిలీజ్‌ విషయంలోనూ ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

కాగా దేవర మొత్తం 2 పార్టులుగా రానుంది. ఇందులో జాన్వీతో పాటు మరో మలయాళ హీరోయిన్‌ నటిస్తుందని టాక్‌ నడుస్తోంది. ఎన్టీఆర్ డ్యూయల్‌ రోల్‌ చేస్తుండడంతో ఒక పాత్రకు జోడీగా శృతి మరాఠేని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటనేమీ వెలువడలేదు. దేవర సినిమాకు లేటెస్ట్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దేవర సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు తారక్‌. ఇది కూడా రెండు పార్టులుగా తెరకెక్కనుందని టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.