పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్ వీడియో
విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’ లో ఫుల్ రగ్డ్ లుక్‌లో, ఒళ్లంతా రక్తంతో భయంకరంగా కనిపిస్తుంటే, రష్మిక మందన్న కూడా తన సినిమా ‘మైసా’ గ్లింప్స్‌లో గన్ పట్టుకుని పక్కా యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్’లో లవర్స్‌గా మెప్పించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. వీరిద్దరి సినిమాల లుక్స్ చూస్తుంటే “ఎలా ఉండేవాళ్ళు.. ఇలా అయిపోయారేంటి?” అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఈ జోడీ ఒకేసారి వయలెంట్ లుక్స్‌తో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక అయితే తన పోస్ట్‌లో “ఇది కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది” అంటూ హింట్ ఇచ్చింది. ఒకప్పుడు లవ్ స్టోరీలతో సాఫ్ట్‌గా కనిపించిన వీరు, ఇప్పుడు ఇలా ఊర మాస్ అవతారాలు ఎత్తడం చూస్తుంటే థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. రవికిరణ్ కోలా దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. సినిమా టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో విజయ్ కనిపించారు. 80ల్లో జరిగే కథ కావడంతో నాటి ప్రపంచాన్ని టెక్నీషియన్స్ అద్భుతంగా తీర్చిదిద్దారని మేకర్స్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
