AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

Samatha J
|

Updated on: Dec 26, 2025 | 11:40 AM

Share

హిమాలయాల్లో రోడ్డుపై నక్క తచ్చాడుతూ కనిపించడంపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. నక్క ఎదురుచూపుల వెనుక ఓ ప్రమాదం ఉందని జనాలను అప్రమత్తం చేశారు. ఈ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతంది. మనుషులు తెలియక చేస్తున్న తప్పులు ఇతర జీవాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయంటూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది .

హిమాలయన్ రెడ్ ఫాక్స్ పాంగాంగ్ సరస్సుకు సమీపంలో సంచరిస్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాలో షేర్ చేశారు. పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని రోడ్డుపై ఆ నక్క కనిపించిందని, ఆ దృశ్యాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని రాసుకొచ్చారు. ప్రకృతి సౌందర్యం మాటల్లో వర్ణించలేనని చెప్పుకొచ్చారు. యూజర్లు సహజంగానే ఆ వీడియోను లైకులు, కామెంట్స్‌తో వైరల్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వేల కొద్దీ లైక్స్, వ్యూస్ రాబట్టింది. జనాన్ని ఎంటర్‌టైన్ చేసింది. కానీ వీడియోలోని ఓ ఆందోళనకర ట్రెండ్‌ను నెటిజన్లు గుర్తించలేకపోయారు. నక్క ప్రవర్తనలో వచ్చిన మార్పును ఐఎఫ్ఎస్ అధికారి ప్రస్తావించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై నక్క వచ్చి, దేని కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉండటం ఆందోళనకరమని హెచ్చరించారు. గతంలో వాహనదారులు రహదారిపై నక్కకు ఆహారం పెట్టి ఉంటారని, దానికి అలవాటు పడి మళ్లీ అది రోడ్డుపైకి వచ్చేసిందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో