గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు మరో స్కామ్ అంటూ రచ్చ నడుస్తోంది. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి అన్నగా భావించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ఇప్పుడు ఆలయ విమాన గోపురం బంగారు తాపడం వెనుక మరో స్కాం ఉందన్న అభియోగాలను వింటున్నారు. టీటీడీ ఇప్పటికే వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన మరో అంశం.. ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం తెర మీదికి వచ్చింది. గత ప్రభుత్వ హయంలో ఇది మరో అక్రమం అవినీతి అంటూ జనసేన గగ్గోలు పెడుతోంది.
ఒక వైపు కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి లాంటి అంశాలపై విచారణ జరుగుతుండగా.. ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ విచారణ అత్యంత గొప్యంగా కొనసాగుతోంది. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30కిపైగా విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి 2022-23 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు టీటీడీ వంద కిలోల బంగారం కేటాయించింది. మరో 4300 కిలోల రాగితో విమాన గోపురం బంగారు తాపడం పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరలతో తాపడం చేయాలని జ్యోతి అనే మహిళ కాంట్రాక్ట్ దక్కించుకుంది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ సబ్ లీజ్‌కు ఇచ్చింది. 9 పొరలతో బంగారు తాపడం పనులు చేపట్టాల్సి ఉండగా రెండు పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30కి పైగా విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
