క్రికెట్ చరిత్రలో క్వాడ్రుపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, ఆరు సిక్సర్లు, ఆరు బౌండరీలు వంటి అద్భుతాలు ఇప్పటికే నమోదయ్యాయి. కానీ ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు వికెట్లు పడగొట్టడం మాత్రం ఇప్పటికీ అసాధ్యంగానే ఉంది. ఇటీవల ఇండోనేషియాకు చెందిన గేడే ప్రియందన అంతర్జాతీయ టీ20లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.