వరంగల్ జిల్లా ఏనుగల్లులో చలిమంటల వద్ద నిద్రిస్తున్న 80 ఏళ్ల నరసమ్మ సజీవ దహనమైంది. విపరీతమైన చలి కారణంగా మంటలు వేసుకున్న ఆమె, నవారు మంచం కింద నెగడును ఉంచింది. నిద్రలో మంటలు వ్యాపించి ఈ విషాదం చోటుచేసుకుంది. చలిమంటలు వేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.