Cinema: ‘బలగం’ లాంటి సినిమా.. థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్నమూవీ.. వీడియోలు వైరల్
ఆ మధ్యన తెలుగులో వచ్చిన బలగం సినిమా ఆడియన్స్‌కి ఎంతలా కనెక్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని చూసి ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి సినిమానే ఒకటి థియేటర్లలో ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తోంది.

క్రిస్మస్ కానుకగా గురువారం (డిసెంబర్ 25) పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. దండోరా, ఛాంపియన్, శంభాలా, ఈషా, పతంగి, దండోరా సినిమాలతో పాటు వృషభ అనే ఓ మలయాళ డబ్బింగ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అయిదే ఇదే సమయంలో తాజాగా వచ్చిన చిత్రం కూడా ఆడియన్స్ చేత కన్నీరు పెట్టిస్తోంది. ఆ మధ్యన తెలుగులో వచ్చిన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవార్డులు, ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక థియేటర్లలో బలగం సినిమాను చూసి జనాలు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అఅలాంటి సీన్లే ఓ సినిమా థియేటర్ దగ్గర కనిపిస్తున్నాయి. క్రిస్మస్ కానుకగా తమిళంలో ఒక సినిమా రిలీజైంది.కేవలం తమిళ్ భాషలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ ప్రభు నటించిన లేటెస్ట్ సినిమా సిరై. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ దర్యాప్తు, ఖైదీల విచారణ నేపథ్యంలో ఎమోషనల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కులం, మతం ఆధారంగా మైనారిటీలను మన సమాజం, న్యాయవ్యవస్థ ఎలా చూస్తుందనే విషయాన్ని ఇందులో చూపించారు. ఘాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన విక్రమ్ ప్రభు ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో అదరగొట్టాడు.అనిష్మా, అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది. జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలు, బీజీఎమ్ సిరై సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
సిరై సినిమా థియేటర్ బయట దృశ్యాలు.. వీడియో..
#Sirai Audience getting emotional after watching the film in theatre ♥️👍
SIRAI 👍👍👍 pic.twitter.com/ZtUNpJDUtl
— Karthik Ravivarma (@Karthikravivarm) December 25, 2025
థియేటర్ కు వచ్చి మరీ సిరై సినిమా చూసిన టీమిండియా క్రికెటర్ అశ్విన్..
cricketer @ashwinravi99 watched and spoke highly about #Sirai. After loads of appreciation from the industry and media, the film comes to theatres…
#Vikramprabhu #sdcworld pic.twitter.com/LHXFo3cPBF
— SDC World (@sdcworldoffl) December 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




