AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal Jayswal : కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా? పంత్ వికెట్ కూడా ఇతనిదే

Vishal Jayswal : విజయ్ హజారే ట్రోఫీలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన మునపటి ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కింగ్ కోహ్లీ జోరు చూస్తుంటే రెండో సెంచరీ కూడా ఖాయమని ఫ్యాన్స్ ఆశపడ్డారు.

Vishal Jayswal : కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా? పంత్ వికెట్ కూడా ఇతనిదే
Virat Kohli
Rakesh
|

Updated on: Dec 26, 2025 | 1:22 PM

Share

Vishal Jayswal : విజయ్ హజారే ట్రోఫీలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన మునపటి ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కింగ్ కోహ్లీ జోరు చూస్తుంటే రెండో సెంచరీ కూడా ఖాయమని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక అన్ నోన్ బౌలర్ కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టి అవుట్ చేశాడు. అతనే గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్. కోహ్లీనే కాదు, టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను కూడా అవుట్ చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

బెంగళూరు వేదికగా ఢిల్లీ-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 58 బంతుల్లో 77 పరుగులు చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అప్పటికే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో, 27 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ తన తెలివైన బౌలింగ్‌తో కోహ్లీని ట్రాప్‌లో పడేశాడు. ఒక బంతిని వేయగా, దాన్ని సిక్సర్‌గా మలచాలనే ప్రయత్నంలో కోహ్లీ క్రీజు దాటి బయటకు వచ్చాడు. కానీ బంతి టర్న్ అవ్వడంతో దాన్ని మిస్ అయ్యాడు, వికెట్ కీపర్ రెప్పపాటు కాలంలో స్టంప్ అవుట్ చేశాడు.

విశాల్ జైస్వాల్ కేవలం విరాట్ వికెట్‌తో ఆగలేదు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌తో సహా మొత్తం నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ వెన్ను విరిచాడు. దీంతో దేశవాళీ క్రికెట్‌లో విశాల్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది.

గుజరాత్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2022-23 సీజన్‌లో జరిగిన అండర్-23 సి.కె.నాయుడు ట్రోఫీలో విశాల్ ఊచకోత కోశాడు. కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లో 70 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా 7 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను 2024లో బీసీసీఐ వార్షిక అవార్డుల్లో స్వయంగా జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లు, బ్యాటింగ్‌లో ఒక సెంచరీ కూడా సాధించి పక్కా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ వికెట్‌తో విశాల్ కెరీర్ మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..