Tollywood Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

పై ఫొటోలో ఉన్న తెలుగు హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిందామె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ వంటి అగ్ర హీరోల పక్కన నటించిందామె. ఒక్క తెలుగులోనే కాదు రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ వంటి ఇతర స్టార్‌ హీరోలతో కలిసి నటించి మెప్పించింది.

Tollywood Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన  తెలుగు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2024 | 1:40 PM

పై ఫొటోలో ఉన్న తెలుగు హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిందామె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ వంటి అగ్ర హీరోల పక్కన నటించిందామె. ఒక్క తెలుగులోనే కాదు రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ వంటి ఇతర స్టార్‌ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ రోల్స్‌లో మెప్పించిన ఆమె నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్‌ గానే ఉండిపోయింది. ఇప్పటికీ అలాగే లైఫ్‌ ను లీడ్‌ చేస్తోంది. ఆ మధ్యన కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో సందడి చేసినా కంటిన్యూ అవ్వలేకపోయింది. రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. మరి తన అందంతో కుర్రకారులో అలజడి రేపిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ తరం జనరేషన్‌కు కొంచెం కష్టమేమో కానీ.. 90’s కాలం నాటి సినీ ప్రేక్షకులు అయితే ఈమెను గుర్తుపట్టవచ్చు. ఇంతకీ ఈ బొద్దుగుమ్మ మరెవరో కాదు.. అలనాటి అందాల తార నగ్మా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ కనిపిస్తుందామె. తాజాగా నగ్మాకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

సినిమాల్లో స్లిమ్‌గా కనిపించి మెస్మరైజ్‌ చేసిన నగ్మా ఇప్పుడు ఒళ్లు చేసి బొద్దుగా కనిపించడమే అభిమానుల షాక్‌కు కారణం. ఈ ఫోటోల్లో నగ్మా గుర్తు పట్టలేనంత లావుగా మారిపోయింది. నగ్మా వయసు ప్రస్తుతం 48. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఓ తోడు, పిల్లలు కావాలని ఉంది అని తెలిపింది. పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. పెళ్లి ద్వారా ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవాలని ఉంది’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే