హిమాలయాల్లో రోడ్డుపై నక్క తచ్చాడటంపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు నక్కకు ఆహారం పెట్టడం వల్ల అది రోడ్డుపైకి వస్తుందని, ఇది దాని ఉనికికే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. వేటాడటం మరిచి, రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.