Rakul Preet Singh: గోవాలోని లగ్జరీ రిసార్ట్‌ హోటల్‌లో రకుల్‌, జాకీల వివాహం.. ఒక్క రోజుకు ధరెంతో తెలుసా?

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ , నిర్మాత జాకీ భగ్నానీ ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోనున్నారు. ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయంలో పెళ్లి వేదికను మార్చేశారు. గోవాలోని ఓ లగ్జరీ హోటల్‌లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారీ లవ్ బర్డ్స్

Rakul Preet Singh: గోవాలోని లగ్జరీ రిసార్ట్‌ హోటల్‌లో రకుల్‌, జాకీల వివాహం.. ఒక్క రోజుకు ధరెంతో తెలుసా?
Rakul Preet Singh Wedding
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2024 | 2:17 PM

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ , నిర్మాత జాకీ భగ్నానీ ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోనున్నారు. ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయంలో పెళ్లి వేదికను మార్చేశారు. గోవాలోని ఓ లగ్జరీ హోటల్‌లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారీ లవ్ బర్డ్స్. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో రకుల్ , జాకీల వివాహం జరగనుంది. ఈ వివాహానికి అతికొద్ది మంది అతిథులు, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. తమ పెళ్లి కోసం గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌ హోటల్‌ను బుక్‌ చేశారట రకుల్‌, జాకీ. ఇదొక విలాసవంతమైన హోటల్. సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్ లో మొత్తం 246 గదులు ఉన్నాయి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఈ రిసార్ట్‌కున్న అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌. ‘మేక్ మై ట్రిప్’ ప్రకారం, గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో ఒక్కో గది ధర రాత్రికి 19 వేల రూపాయల నుండి 75 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో అదనంగా కొన్ని పన్నులు కూడా ఉన్నాయి. గోవాలోని ఈ హోటల్‌లో రకుల్‌, జాకీల పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

రకుల్, జాకీల పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగనుంది. అందుకే ఎవరికీ కూడా ప్రింటెడ్ ఇన్విటేషన్లు ఇవ్వలేదు. అంతా డిజిటల్ ఆహ్వానమే. అదే విధంగా తమ వివాహ వేడుకలో పటాకులకు చోటు లేదని ఈవెంట్ మేనేజర్‌ స్పష్టం చేశారు. దీంతో చాలా మందికి రకుల్, జాకీలు ఆదర్శంగా నిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పార్టీలు, సినిమా ఈవెంట్లలో కలిసి కనిపిస్తున్నారు. లాక్‌డౌన్ సమయం నుంచే వీరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళ్‌, కన్నడతో పాటు బాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక రకుల్‌కు కాబోయే భర్త జాకీ భగ్నానీ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. సినిమా రంగానికి చెందిన వీరిద్దరూ పెళ్లిపీటలెక్కడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ముందస్తు శుభాకంక్షలు తెలుపుతున్నారు .

ఇవి కూడా చదవండి

గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్..

కాబోయే భర్తతో రకుల్ ప్రీత్ సింగ్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్