- Telugu News Photo Gallery Cinema photos Makers are coming forward to prepare sequels for Female oriented films
Sequel Films: మేము సత్తా చూపిస్తామంటున్న హీరోయిన్లు.. ఫీమేల్ ఓరియంటెడ్ సీక్వెల్స్..
సినిమా ఇండస్ట్రీలో వంద కోట్ల స్టామినా మేల్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకే ఉంటుందా? అంటే, వెంటనే యస్ అనే మాట వినిపిస్తుంది. స్టోరీలో సత్తా ఉంటే, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలూ ఆ రేంజ్‌లో కలెక్ట్ చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. కథల మీదా, కమర్షియల్ సక్సెస్ మీద, ప్రేక్షకాదరణ మీదా ఉన్న నమ్మకంతోనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకూ సీక్వెల్స్ సిద్ధం చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారన్నది వారి మాట.
Updated on: Feb 15, 2024 | 2:31 PM

భామా కలాపం సినిమా చూసిన వారందరూ ఎక్సలెంట్ రైటింగ్ అని మెచ్చుకున్నారు. ప్రియమణికి టైలర్ మేడ్ కేరక్టర్ అన్నారు. అందుకే ఆహా ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ అందుకుంది భామా కలాపం.

ఆ సినిమాకు వచ్చిన స్పందన చూసిన మేకర్స్ వెంటనే సీక్వెల్ మీద ఫోకస్ చేశారు. బామా కలాపం2 ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రమోషనల్ కంటెంట్‌లో ప్రతి డైలాగూ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది... ఆహాలో ఈ నెల 16న విడుదల కానుంది బామా కలాపం2.

అంజలి హీరోయిన్‌గా నటించిన సినిమా గీతాంజలి. హారర్ జోనర్‌లో ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోనర్‌ని కంటిన్యూ చేస్తూ ఆమె నటిస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సారి ఈ కథలో ఇంకేం ఎలిమెంట్స్ ని పొందుపరుస్తారోననే ఆసక్తి ఈ జోనర్ లవర్స్ లో బాగానే కనిపిస్తోంది.

ఈ మధ్య రీఎంట్రీలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మంచి హిట్ అందుకున్నారు అనుష్క. ఆమె నటించిన భాగమతికి సీక్వెల్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఓ మలయాళ సినిమా షూటింగ్‌లో ఉన్నారు అనుష్క శెట్టి. అది పూర్తికాగానే భాగమతి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతారన్నది ఫిల్మ్ నగర్ న్యూస్.

ఇటు సమంత కూడా ఫ్యామిలీమేన్3కి ప్రిపేర్ అవుతున్నారు. వెబ్ సీరీస్ పరంగానే కాదు, సినిమా పరంగానూ ఆమె ఖాతాలో ఓ సీక్వెల్ ఉంది. మయోసైటిస్ సోకడానికి ముందు ఆమె నటించిన సినిమా యశోద. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలున్నాయని గతంలో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సమంత కమ్‌బ్యాక్ టైమ్‌లో ఆ ప్రాజెక్టు మీద కూడా హోప్స్ పెంచుకుంటున్నారు సామ్ ఫ్యాన్స్.




