AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: వేలంటైన్స్‌డే రోజే.. పబ్‌లో ప్రియుడి తల పగల గొట్టిన పాయల్‌ రాజ్‌ పుత్‌.. వీడియో

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో టాక్ ఆఫ్‌ ది టౌన్‌ గా మారిపోయింది పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ మూవీలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది . అయితే వన్‌ ఫిల్మ్ వన్‌ వండర్‌ లా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత పాయల్‌ చేసిన సినిమాలన్నీ నిరాశపర్చాయి. ఆర్‌డీఎక్స్‌ లవ్, వెంకీమామా, డిస్కోరాజా, జిన్నా తదితర సినిమాలు చేసినా హిట్‌ బొమ్మ మాత్రం పడలేదు

Payal Rajput: వేలంటైన్స్‌డే రోజే.. పబ్‌లో ప్రియుడి తల పగల గొట్టిన పాయల్‌ రాజ్‌ పుత్‌.. వీడియో
Actress Payal Rajput
Basha Shek
|

Updated on: Feb 15, 2024 | 3:49 PM

Share

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో టాక్ ఆఫ్‌ ది టౌన్‌ గా మారిపోయింది పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ మూవీలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది . అయితే వన్‌ ఫిల్మ్ వన్‌ వండర్‌ లా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత పాయల్‌ చేసిన సినిమాలన్నీ నిరాశపర్చాయి. ఆర్‌డీఎక్స్‌ లవ్, వెంకీమామా, డిస్కోరాజా, జిన్నా తదితర సినిమాలు చేసినా హిట్‌ బొమ్మ మాత్రం పడలేదు. అనగనగా ఓ అతిథి, 3 రోజెస్‌ వంటి ఓటీటీ సినిమాలు, సిరీస్‌లతో అదృష్టం పరీక్షించుకున్నా సక్సెస్‌ మాత్రం రాలేదు. కెరీర్‌ గందరగోళంగా కొనసాగుతున్న తరుణంలోనే మరోసారి ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ పాయల్‌కు మరో మూవీ ఛాన్స్ ఇచ్చాడు. అదే మంగళవారం. గతేడాది రిలీజైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో సక్సెస్‌ కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన పాయల్‌కు మంగళవారం మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీగా మారుతోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే పాయల్‌ రాజ్ పుత్‌ సౌరభ్‌ ఢింగ్రా అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పలు సందర్భాల్లో ఆమెనే ఈ విషయాన్ని పంచుకుంది. తరచూ షికార్లు, వెకేషన్‌లకు వెళుతుంటారీ లవ్లీక పుల్.

ఇవి కూడా చదవండి

తాజాగా వేలంటైన్స్‌ డే రోజున పురస్కరించుకుని ఇన్‌ స్టా గ్రామ్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది పాయల్‌. పబ్బులో గాజు గ్లాసుతో తన ప్రియుడు సౌరభ్‌ తల బద్దలు కొట్టినట్టుగా వీడియోలో కనిపించింది. ‘నేను వేలంటైన్స్‌డే ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నాను. మరి మీరు ఎలా జరుపుకొన్నారు. కింద కామెంట్‌ చేయండి’ అంటూ తన వీడియోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది పాయల్‌. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారందరూ అసలేమైంది? అని మొదట కంగారు పడ్డారు. అయితే ఇదంతా సినిమా షూట్‌లో ఒక భాగమని తెలుసుకుని నెటిజన్స్ రిలాక్స్‌ అయ్యారు. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్‌.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌కు సౌరభ్‌ స్పందిస్తూ.. చాలా బ్యాడ్‌ ఐడియా అని సమాధానమిచ్చాడు.

ప్రియుడి తల బద్దలు కొట్టిన పాయల్ … వీడియో

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పుత్..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!