2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు, మోనాలిసా నుంచి అక్షయ్ కన్నా వరకు, వయా ఐఐటీ బాబా!
మరి కొద్ది రోజుల్లో ముగింపు పలుకబోతున్న 2025 సంవత్సరం పలువురు అనామకులను సెలబ్రిటీలను చేసేంది. చాలా కాలం తర్వాత మరికొందరు ట్యాలెంటెడ్ పర్సన్స్‌ను మరోసారి ఫేమస్ చేసేసింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహా కుంభమేళా సందర్భంగా పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా.. ఒక్క రాత్రిలోనే ఫేమస్ అయిపోయింది. ఐఐటీ బాబా, ఆయుష్, సూరజ్ చెరుకుట్, అక్షయ్ కన్నాలు కూడా ఈ ఏడాదిలో వైరల్ స్టార్లు అయ్యారు.

మరి కొద్ది రోజుల్లో ముగింపు పలుకబోతున్న 2025 సంవత్సరం పలువురు అనామకులను సెలబ్రిటీలను చేసేంది. చాలా కాలం తర్వాత మరికొందరు ట్యాలెంటెడ్ పర్సన్స్‌ను మరోసారి ఫేమస్ చేసేసింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహా కుంభమేళా సందర్భంగా పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా.. ఒక్క రాత్రిలోనే ఫేమస్ అయిపోయింది. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. కొందరు ఆమెను హీరోయిన్ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఇలాంటి జాబితాలో ఉన్న మరికొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

Monalisa
మహా కుంభ్‌లో మోనాలిసా:
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ మేళా సందర్భంగా తన వృత్తి అయిన పూసలు అమ్ముకునేందుకు వచ్చింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నుంచి వచ్చిన మోనాలిసా మహా కుంభ్‌లో రుద్రాక్ష దండలు విక్రయిస్తుండగా.. ఆమెను కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆమె అందం, ముఖ్యంగా ఆమె కళ్లు అమితంగా ఆకర్షించడంతో ఇంటర్నెల్ సంచలనంగా మారింది. ప్రపంచంలో ప్రఖ్యాత పెయింటింగ్ ‘మోనాలిసా’తో ఆమెను పోల్చుతూ ఫేమస్ చేసేశారు. ఆమె బాగా ఫేమస్ కావడంతో ఆమె కోసం జనం వెదకడం ప్రారంభించారు. దీంతో భద్రతా కారణాలతో ఆమెను కుంభ్ నుంచి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆమె అందానికి ఫిదా అయిన కొందరు సినీ ప్రముఖులు ఆమెకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మోనాలిసాను హీరోయిన్ చేస్తానని ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంప్రదించి ఆడిషన్స్ కూడా నిర్వహించారు. పలు యాడ్స్ కూడా చేసేస్తోంది. దీంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.

Hanumankind
గ్లోబల్ హిప్-హాప్ హనుమాన్‌కైండ్:
ఈ ఏడాదిలో ఫేమస్ అయిన మరో వ్యక్తి కేరళకు చెందిన రాపర్ సూరజ్ చెరుకట్ అకా ‘హనుమాన్ కైండ్’. భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి మరోసారి కొత్తగా పరిచేశాడీ యువకుడు. బిగ్ డాగ్స్, మౌత్ కా కువాన్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కోచెల్లాలో చెండా మేళంతో ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించాడు.

Ayush
మార్కెట్ ట్రెండ్‌గా మారిన పొరపాటు:
కొన్నిసార్లు అనుకోకుండా చేసిన చిన్న తప్పులు కూడా కొందర్ని స్టార్‌గా మార్చగలదని 2025 మరోసారి రుజువు చేసింది. ఇలా స్టార్ అయిన యువకుడు కంటెంట్ క్రియేటర్ అయిన ఆయుష్. ఆయుష్ తన వీడియోలో అనుకోకుండా ఫ్రెంచ్ పదం ‘క్రోసెంట్’ను.. ప్రశాంత్ అని తప్పుగా ఉచ్ఛరించాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో మీమ్స్ ట్రీట్‌గా మారింది. ఇది ఎంతగా వైరల్ అయ్యిందంటే.. బ్రిటానియా వంటి ప్రధాన బ్రాండ్లు తమ ఉత్పత్తుల పేర్లను కూడా మార్చాకోవాల్సి వచ్చింది.

Iitian Baba
మహా కుంభ్‌లో టెక్ బాబా:
ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో మోనాలిసా తర్వాత ఫేమస్ అయిన మరో వ్యక్తి ఎవరంటే హర్యానాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభయ్ సింగ్. కుంభమేళాకు హాజరయ్యేందుకు ఐఐటీ బాంబేలో తన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువును, కెనడాలో మిలియన్ డాలర్ల ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. టెక్ బాబాగా ఇతడు ఫేమస్ అయ్యాడు. అదే స్థాయిలో అతని వ్యవహారం వివాదాస్పదం కూడా అయ్యింది. అతను చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. తాను జునా అఖారాకు చెందిన వ్యక్తినంటూ అభయ్ చెప్పుకోగా.. తమ అఖారా నుంచి అతడ్ని ఎప్పుడో బహిష్కరించామని జునా అఖారా ప్రకటించడం చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ ఐఐటీ, టెక్ బాబాగా అభయ్ సింగ్ ఈ ఏడాది చాలా ఫేమస్ అయ్యాడు.

Akshay Khanna
ధురంధర్ ‘అక్షయ్ ఖన్నా’:
2025 చాలా కాలంగా కనుమరుగైన ఓ స్టార్‌ను మరోసారి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది. ఆయనే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా. ఎలాంటి ప్రమోషన్ లేదా పీఆర్ లేకుండానే తన ట్యాలెంట్‌తోనే అక్షయ్ కన్నా మరోసారి తన సత్తా చాటారు. బాలీవుడ్ సంచలనం ‘ధురంధర్’ సినిమాలో అక్షయ్ కన్నా నటన, డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇన్‍స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ప్రముఖులు కూడా అక్షయ్ కన్నా నటనకు ముగ్ధులై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియా అయితే ‘అండర్ రేటెడ్ కింగ్’ అని, సోషల్ మీడియా కింగ్ అంటూ ఆకాశానికెత్తేస్తోంది.