Sachin Tendulkar: ‘వహ్‌.. తాజ్‌’.. భార్యతో కలిసి తాజ్‌ మహల్‌ను సందర్శించిన సచిన్.. ప్రేమ సౌధం అందాలకు ఫిదా

ప్రేమికుల రోజు తర్వాత భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి తాజ్ మహల్‌ను సందర్శించాడు. పవిత్ర ప్రేమకు ప్రతీక అయిన ఈ చారిత్రాత్మక కట్టడం అందాలను చూసి ఫిదా అయ్యారు. సచిన్ వెంట ఆయన సతీమణి అంజలి టెండూల్కర్‌ కూడా ఉన్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య

Sachin Tendulkar: 'వహ్‌.. తాజ్‌'.. భార్యతో కలిసి తాజ్‌ మహల్‌ను సందర్శించిన సచిన్.. ప్రేమ సౌధం అందాలకు ఫిదా
Sachin Tendulkar
Follow us
Basha Shek

|

Updated on: Feb 16, 2024 | 1:12 PM

ప్రేమికుల రోజు తర్వాత భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి తాజ్ మహల్‌ను సందర్శించాడు. పవిత్ర ప్రేమకు ప్రతీక అయిన ఈ చారిత్రాత్మక కట్టడం అందాలను చూసి ఫిదా అయ్యారు. సచిన్ వెంట ఆయన సతీమణి అంజలి టెండూల్కర్‌ కూడా ఉన్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య తాజ్‌ మహల్‌ దగ్గరకు చేరుకున్నారు సచిన్‌ దంపతులు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి డయానా బెంచ్‌పై కూర్చోని ఫొటోలు కూడా దిగాడు మాస్టర్‌ బ్లాస్టర్‌. సచిన్‌ రాకను గమనించిన పర్యాటకులు అతనితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అలాగే ‘సచిన్‌.. సచిన్‌’ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. సచిన్ దంపతులు తాజ్‌మహల్‌ను వీక్షిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు, టూరిస్టులు చూసేందుకు ఎగబడ్డారు. సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారికి సాధ్యం కాలేదు. దీంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. ప్రస్తుతం సచిన్‌ తాజ్‌ మహల్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్ సుమారు 24 ఏళ్లు. మొత్తం 664 మ్యాచ్‌లు ఆడి 100 సెంచరీల సహాయంతో 34,357 పరుగులు చేశాడీ లెజెండరీ క్రికెటర్‌. 2013లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. త్వరలో సచిన్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడి అభిమానులను అలరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

తాజ్ మహల్ దగ్గర సచిన్, అంజలి… వీడియో

డయాన్ బెంచ్ పై సచిన్, అంజలి..

కారు నిలిపి అభిమానితో మాట్లాడుతున్న సచిన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..