Sarfaraz Khan: అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ.. గ్యాలరీలోని సర్ఫరాజ్ సతీమణి ఏం చేసిందో తెలుసా? వీడియో
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ తరఫున సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు . ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరంగేంట్ర మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలు కొట్టాడు
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ తరఫున సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు . ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరంగేంట్ర మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ రన్ యావరేజ్ సాధించి, ఆ తర్వాత తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన స్పెషల్ ప్లేయర్ల జాబితాలో సర్ఫరాజ్ చేరాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా ఆయన భార్య రొమానా జహూర్ ఇచ్చిన రియాక్షన్ వీడియో వైరల్ అవుతోంది. అరంగేట్రం టెస్టులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత అతను తన తండ్రి భార్య కూర్చున్న స్టాండ్ వైపు తన బ్యాట్‌ను చూపించాడు. అదే సమయంలో అతని సతీమణి రొమానా జహూర్ ప్రేక్షకుల గ్యాలరీ నుండి సర్ఫరాజ్‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సర్ఫరాజ్ ఖాన్ కేవలం 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 62 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు రవీంద్ర జడేజా రాంగ్ కాల్ కారణంగా నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో 65 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసి హాఫ్ సెంచరీ చేసి రనౌట్ అయిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు సర్ఫరాజ్. ఇక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. కడపటి వార్తలందే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో జడేజా 112 పరుగులు చేసి ఔట్ కాగా, కుల్ దీప్ నాలుగు పరుగులకు పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ (18), ధ్రువ్ జురేల్ (10) క్రీజులో ఉన్నారు.
భర్తకు ఫ్లయింగ్ కిస్ లు..
— Nihari Korma (@NihariVsKorma) February 15, 2024
మ్యాచ్ లో సర్ఫరాజ్ కుటుంబ సభ్యులు..
Rohit Sharma congratulated Sarfaraz Khan father and Wife before Match!💙
( Rohit yahan v bhool gya kuchh sec.. ke liye ki kya bolna h😭, Rohit Sharma’s forgetting things can never ending story 😍 🤣😭)pic.twitter.com/1MBjRQnuzh
— 🧢ʀᴀᴊɴᴀɴᴅᴀɴɪ ꜱɪɴɢʜ⁴⁵🇮🇳 ( Rohika) (@Singh_Ro45) February 15, 2024
భార్య ఎమోషనల్..
Sarfaraz Khan’s father and Wife in tears when Sarfaraz received the Indian Test cap.
Sarfaraz Khan’s father kissing the Indian cap of his son. pic.twitter.com/awlVQdmMBX
— Abhimanyu Indian (@Abhi321997) February 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..