The Kerala Story OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న అదాశర్మ ‘ది కేరళ స్టోరీ’.. రికార్డు వ్యూస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

హార్ట్ అటాక్‌ హీరోయిన్‌ అదా శర్మ నటించిన ' ది కేరళ స్టోరీ' చిత్రం వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. మే 5, 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు OTT లోకి అడుగుపెట్టింది . థియేటర్‌లో సంచలనం రేపిన ఈ సినిమా ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌..

The Kerala Story OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న అదాశర్మ 'ది కేరళ స్టోరీ'.. రికార్డు వ్యూస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
The Kerala Story Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 20, 2024 | 7:11 PM

హార్ట్ అటాక్‌ హీరోయిన్‌ అదా శర్మ నటించిన ‘ ది కేరళ స్టోరీ’ చిత్రం వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. మే 5, 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు OTT లోకి అడుగుపెట్టింది . థియేటర్‌లో సంచలనం రేపిన ఈ సినిమా ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5లో ఈ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.ఈ సినిమాలో ఓ వివాదాస్పద కథాంశం ఉఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. అదా శర్మ హిందూ మతం నుండి ముస్లింగా మారిన తర్వాత చాలా కష్టాలను అనుభవించే అమ్మాయి పాత్రను పోషిస్తుంది. కేరళలో జరిగిన మతమార్పిడి ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ మూవీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం మండిపడ్డాయి. ఇప్పుడు మళ్లీ OTTలో విడుదలైన తర్వాత, ‘ది కేరళ స్టోరీ’ గురించి చర్చ మళ్లీ బలంగా వినిపిస్తోంది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద 242 కోట్ల రూపాయలను రాబట్టింది. ఫారిన్ కలెక్షన్స్ కలుపుకుంటే దాదాపు రూ.303 కోట్లు. అదే విధంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఓటీటీలో చూస్తున్నారు. ఇది మొదటి వారాంతంలో 150 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను క్రాస్‌ చేసింది. ఇదో రికార్డ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది జీ5 సంస్థ.

9 నెలల క్రితమే ‘ది కేరళ స్టోరీ’ సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ ఓటీటీకి రావడం ఆలస్యమైంది. వివాదం కారణంగా చాలా OTT ప్లాట్‌ఫారమ్‌లు ఈ చిత్రాన్ని ప్రసారం చేయడానికి ఇష్టపడలేదు. చివరగా, ఈ చిత్రాన్ని ‘జీ5’ ద్వారా OTTలో ప్రసారం చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నటి అదా శర్మకు డిమాండ్ పెరిగింది. ఆఆమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి