Malaikottai Vaaliban OTT: ఆఫీషియల్‌.. ఓటీటీలో మోహన్‌లాల్ మలైకోటై వాలిబన్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

రిలీజ్‌ కు ముందు మలైకోటై వాలిబన్‌ టీజర్లు, పోస్టర్స్, ట్రైలర్‌ చూస్తే బాహుబలి సినిమాను తలపించాయి. అయితే గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న విడుదలైన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ యావరేజ్ గా నిలిచింది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లు మాత్రమే సాధించింది

Malaikottai Vaaliban OTT: ఆఫీషియల్‌.. ఓటీటీలో మోహన్‌లాల్ మలైకోటై వాలిబన్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Malaikottai Vaaliban Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 21, 2024 | 11:56 AM

మలయాళ సూపర్ స్టార్ నటించిన తాజా చిత్రం మలైకోటై వాలిబన్. లిజో జోష్‌ పెల్లిస్సెరీ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌ లో హరీష్‌ పేరడి కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్స్ విద్యుత్‌ జమ్వాల్‌, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌, మనికంద రాజన్‌, ఆండ్రియా రావెరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిలీజ్‌ కు ముందు మలైకోటై వాలిబన్‌ టీజర్లు, పోస్టర్స్, ట్రైలర్‌ చూస్తే బాహుబలి సినిమాను తలపించాయి. అయితే గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న విడుదలైన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ యావరేజ్ గా నిలిచింది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లు మాత్రమే సాధించింది. అయితే ఎప్పటిలాగే మోహన్ లాల్‌ నటన, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయ. థియేటర్లలో మిక్స్‌ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మలైకోటై వాలిబన్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మోహన్ లాల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 23 నుంచే మలైకోటై వాలిబన్ ను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ మోహన్ లాల్ మూవీ అందుబాటులో ఉండనున్నట్లు తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.

మ్యాక్స్ ల్యాబ్స్‌-సెంచురీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై జాన్‌-మేరీ క్రియేటివ్‌ భారీ బడ్జెట్‌ తో మలైకోటై వాలిబన్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అయితే సినిమాలో పెద్దగా కథ లేకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే మోహన్ లాల్ నటన అలాగే యాక్షన్ సినిమాలు చూసే వారికి మాత్రం మలైకోటై వాలిబన్ నచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మలైకోటై వాలిబన్ లో మోహన్ లాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.