Kriti Kharbanda: పవన్ కల్యాణ్ ‘తీన్‌ మార్’ హీరోయిన్ పెళ్లి ముహూర్తం పిక్స్‌.. ప్రియుడితో వివాహం ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి కర్బందా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది . ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది ఆడియెన్స్‌ కు కూడా పరిచయమే. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ తీన్ మార్‌, మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య, అలాగే రామ్ పోతినేని ఒంగోలు గిత్త సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే బ్రూస్ లీ సినిమాలో రామ్‌ చరణ్‌ సోదరిగానూ అలరించింది.

Kriti Kharbanda: పవన్ కల్యాణ్ 'తీన్‌ మార్' హీరోయిన్ పెళ్లి ముహూర్తం పిక్స్‌.. ప్రియుడితో వివాహం ఎప్పుడు, ఎక్కడంటే?
Kriti Kharbanda Marriage
Follow us
Basha Shek

|

Updated on: Feb 20, 2024 | 5:58 PM

ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి కర్బందా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది . ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది ఆడియెన్స్‌ కు కూడా పరిచయమే. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ తీన్ మార్‌, మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య, అలాగే రామ్ పోతినేని ఒంగోలు గిత్త సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే బ్రూస్ లీ సినిమాలో రామ్‌ చరణ్‌ సోదరిగానూ అలరించింది. కన్నడలో యష్‌తో కలిసి ‘గూగ్లీ’ సినిమాతో విజయాన్ని అందుకుంది కృతి కరబంధ. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కృతి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో కృతి కర్బందా ప్రేమలో ఉంది . తమ ప్రేమ విషయాన్ని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారీ లవ్లీ కపుల్‌. ఇప్పుడీ వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా లభించిందిని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మార్చి 13న కృతి, పుల్కిత్‌ ల వివాహం జరగనుందని సమాచారం . అయితే తమ పెళ్లి గురించి కృతి కానీ పుల్కిత్ సామ్రాట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కృతి కరబంధ, పుల్కిత్ సామ్రాట్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫోటోలు వైరల్‌గా మారాయి. తమ ప్రేమను దాచుకోలేదు. ఈ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. వీరి వివాహం మార్చి 13న జరగనుందని సన్నిహితులు తెలిపినట్లు ‘బాలీవుడ్ హంగామా’ నివేదించింది. ఇటీవల, ప్రేమికుల రోజున, కృతి సనన్ పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి ఒక ఫోటోను షేర్ చేసి, దానికి ‘లెట్స్ మార్చ్ టు హ్యాండ్ హ్యాండ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. పెళ్లిపై హింట్ ఇచ్చేందుకే మార్చ్ అనే పదాన్ని వాడారని అభిమానులు ఊహించారు. ఇప్పటికే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే పెళ్లి చోటుకు సంబంధించిన సమాచారం మాత్రం ఇంకా సీక్రెట్ గానే ఉంది. కృతి, పుల్ కిత్‌ సామ్రాట్‌ కలిసి తైష్, పాగల్ పంటి, వీరే ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు. 2019 నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పుల్కిత్ సామ్రాట్ గతంలో శ్వేతా రోహిరాను 2014లో వివాహం చేసుకున్నారు. కానీ వీరు 2018లో విడిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.