- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde latest bridal look photos in yellow saree goes viral
Pooja Hegde: పెళ్లి కూతురిలా మారిపోయిన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే అందమైన ఫొటోలు చూశారా?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు ఈ మధ్యన గడ్డు కాలం నడుస్తోంది. ఏ సినిమా చూసినా వర్కవుట్ కావడం లేదు. అందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లుందీ ముద్దుగుమ్మ. సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది పూజ.
Updated on: Feb 20, 2024 | 5:35 PM

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు ఈ మధ్యన గడ్డు కాలం నడుస్తోంది. ఏ సినిమా చూసినా వర్కవుట్ కావడం లేదు. అందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లుందీ ముద్దుగుమ్మ. సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది పూజ.

సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది పూజ. తన లేటెస్ట్ ఫొటోలు, గ్లామరస్ పిక్స్‌ను అందులో షేర్ చేస్తోంది.

తాజాగా పసుపు చీర ధరించి కొత్త పెళ్లి కూతురుగా ముస్తాబైంది పూజ. అందమైన చీరకట్టు, బ్లౌజులకు సరిపడా ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చింది.

మెడలో నెక్లెస్, చెవి పోగులు, తలలో మల్లెపూలతో చేయించిన పూలజడ పూజా హెగ్డే అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. అలాగే సింపుల్ మేకప్, లేత రంగు లిప్ స్టిక్ తో ఉన్న బుట్ట బొమ్మను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం పూజా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తోన్న దేవా చిత్రంలో నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కాకుండా అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5లోనూ నటిస్తుంది పూజ. వీటితో పాటు కోలీవుడ్ లోనూ ఓ మల్టీ స్టారర్ మూవీలో పూజకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం