Bootcut Balaraju OTT: ఓటీటీలో బూట్‌కట్ బాలరాజు.. ‘బిగ్ బాస్’ సొహైల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'బూట్ కట్ బాల రాజు. మేఘ లేఖ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్‌లో మేఘ లేఖ హీరోయిన్‌గా నటించింది. సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బూట్ కట్ బాల రాజు. శ్రీ కోనేటి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్‌లో మేఘ లేఖ హీరోయిన్‌గా నటించింది. సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరో సయ్యద్ సొహైల్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం, ప్రమోషన్లు గట్టిగా నిర్వహించడంతో బూట్ కట్ బాలరాజుపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సినిమా కథ బాగున్నప్పటికీ, ఎంటర్ టైన్మెంట్ మస్త్ గా ఉన్నప్పటికీ కొత్త దనం లేకపోవడంతో బూట్ కట్ బాలరాజు యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో బూట్ కట్ బాలరాజు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి సొహైల్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన బూట్ కట్ బాలరాజు సినిమాను గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై సోహైల్ నిర్మించాడు. పేద, ధనిక అంతరాలకు కాస్త కామెడీ టచ్ ఇచ్చి ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీ కోనేటి. సినిమాలోకామెడీ కూడా సూపర్బ్ గా ఉందని కామెంట్లు వినిపించా యి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో హీరో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. మరి ఓటీటీలోనైనా బూట్ కట్ బాలరాజుకు మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.
బూట్ కట్ బాలరాజు ట్రైలర్..
Experience rollercoaster of emotions and laughter✨
Here’s The Theatrical Trailer of #BootcutBalaraju.
In Cinemas from FEB 2nd.#BootcutBalarajuOnFeb2nd@RyanSohel #Meghalekha @sreekoneti1 #MdPasha #Globalfilms @BootcutBalaraju @SonyMusicSouth pic.twitter.com/YkWAfKPG1R
— Syed Sohel Ryan (@RyanSohel) January 24, 2024
Blockbuster Public Response for #BootcutBalaraju!💥
Watch this ultimate hilarious entertainer in Cinemas near you!
Book your tickets now! 🎟️ https://t.co/vuIk4WAWQV#BlockbusterBootcutbalaraju@RyanSohel #Meghalekha @sreekoneti1 #MdPasha #Globalfilms @BootcutBalaraju… pic.twitter.com/onfe94h2hE
— Syed Sohel Ryan (@RyanSohel) February 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








