Juhi Chawla: 1000 మొక్కలు నాటి.. కూతురి బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన హీరోయిన్.. ఫ్యాన్స్ ప్రశంసలు

సెలబ్రిటీల పిల్లల పుట్టినరోజు వేడుకలంటే గ్రాండ్‌ గానే ఉంటాయి. కేక్ కటింగ్స్, విందులు, వినోదాల వంటి కార్యక్రమాల కోసం లక్షలు వెచ్చిస్తారు. అయితే వీటన్నింటినీ బ్రేక్ చేసింది జూహీ చావ్లా. తన కుమార్తె జాహ్నవి మెహతా పుట్టిన రోజును వినూత్నంగా సెలబ్రేట్‌ చేసి అందరికీ రోల్‌ మోడల్ గా నిలిచింది

Juhi Chawla: 1000 మొక్కలు నాటి.. కూతురి బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన హీరోయిన్.. ఫ్యాన్స్ ప్రశంసలు
Juhi Chawla Family
Follow us
Basha Shek

|

Updated on: Feb 21, 2024 | 2:02 PM

బాలీవుడ్‌ ప్రముఖ నటి జుహీ చావ్లా మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 90వ దశకంలో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగులోనూ నాగార్జునతో విక్కీదాదా, శాంతి క్రాంతి వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది జుహీ చావ్లా. పూర్తిగా తన కుటుంబానికి సమయాన్ని వెచ్చిస్తోంది. తాజాగా జుహీ చేసిన ఒక పనిపై పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీల పిల్లల పుట్టినరోజు వేడుకలంటే గ్రాండ్‌ గానే ఉంటాయి. కేక్ కటింగ్స్, విందులు, వినోదాల వంటి కార్యక్రమాల కోసం లక్షలు వెచ్చిస్తారు. అయితే వీటన్నింటినీ బ్రేక్ చేసింది జూహీ చావ్లా. తన కుమార్తె జాహ్నవి మెహతా పుట్టిన రోజును వినూత్నంగా సెలబ్రేట్‌ చేసి అందరికీ రోల్‌ మోడల్ గా నిలిచింది. అదేంటంటే.. జాహ్నవి పుట్టిన రోజును పురస్కరించుకుని సుమారు 1000కి పైగా మొక్కలు నాటింది జూహీ. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌ గా మారింది.

జూహీ చావ్లా కూతురు జాహ్నవికి ప్రస్తుతం 23 ఏళ్లు. ఆమెకు సినిమాలంటే ఆసక్తి లేదు. జాన్వీ మెహతా తన తల్లిలా నటి కావాలని కోరుకోవడం లేదు. బదులుగా ఆమె రచయిత కావాలని నిర్ణయించుకుంది. అందుకే స్టార్ కిడ్స్ గ్రూపులో పెద్దగా కనిపించడం లేదు. ఇక తన కూతురు బర్త్ డే సందర్భంగా జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలనుకుంది జూహీ చావ్లా. అందుకే వెయ్యి మొక్కలు నాటినట్లు తెలిపారు. తద్వారా పర్యావరణంపై ప్రేమను చాటుకుందామె. ‘నా గారాల పట్టి జాహ్నవి కోసం, ఆమె పుట్టినరోజున 1000 చెట్లు నాటాను. ఆమె, ఆమె తరం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని, ఉడుతలు, పక్షులు, సీతాకోకచిలుకలు కూడా ప్రశాంతంగా జీవించాలని మా ఆశ, కోరిక. హ్యాపీ బర్త్ డే డియర్‌ జాహ్నవి’ అంటూ జూహీ చావ్లా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కూతురుతో కలిసి దిగిన ఫొటో, వీడియోను షేర్ చేసింది జూహీ.

ఇవి కూడా చదవండి

కూతురితో జూహీ చావ్లా..

ఫ్యామిలీతో వెకేషన్ లో జూహీ చావ్లా..

ఒకప్పుడు జుహీ చావ్లా చాలా బిజీ నటి. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అడపాదడపా మాత్రమే మూవీస్ లో నటిస్తోంది. అలాగే టీవీషోల్లోనూ సందడి చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.