- Telugu News Photo Gallery Cinema photos Tollywood film industry will be busy with shootings in the summer of 2024
Summer Movies: మారిన సమ్మర్ ట్రెండ్.. మూవీ షూటింగులవైపు అడుగులు..
సమ్మర్ అంటే రిలీజుల సందడే గుర్తుకొస్తుంది. బట్ ఫర్ ఎ చేంజ్ 2024 సమ్మర్‌లో మాత్రం షూటింగులతో సినీ ఇండస్ట్రీ కళకళలాడనుంది. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులకు ఫుల్‌స్టాప్ పెట్టి, నెక్స్ట్ సినిమాల వైపు ట్రావెల్ చేసేవారు కొందరైతే, చేస్తున్న సినిమాలను కంటిన్యూ చేస్తూనే, కొత్త ప్రాజెక్టు పనుల మీదా ఫోకస్ పెంచాలనుకునే స్టార్లు మరికొందరు... ఇంతకీ ఎవరు వారు... చూసేద్దాం రండి....
Updated on: Feb 21, 2024 | 1:35 PM

అటు ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కిని కంప్లీట్ చేస్తున్నారు. ఈ భారతీయ ఇతిహాసం సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని షూటింగ్ పూర్తయిన తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెడతారన్నది న్యూస్.

కొరటాల దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు తారక్. ఓ వైపు దేవర పనులతో ఉంటూనే, వార్2కి ఇచ్చిన కాల్షీట్లలో నార్త్ కి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది తారక్. సో, మరి కొన్ని రోజుల దాకా తారక్ కాల్షీట్లు సౌత్, నార్త్ ట్రిప్పులతో ఫిల్ కాబోతున్నాయన్నమాట.

సంక్రాంతికి కుర్చీలు మడతపెట్టి మరీ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టిన స్టార్ మహేష్‌బాబు. ఆ సినిమా సక్సెస్ సంబరాలు పూర్తి కాగానే జక్కన్న సినిమా మీద దృష్టి పెట్టేశారు సూపర్‌స్టార్. ఇంటర్నేషనల్ రేంజ్‌లో దద్దరిల్లబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఈ మధ్యనే జర్మనీ కూడా వెళ్లొచ్చారు. ఈ సమ్మర్‌కి కంప్లీట్‌గా రాజమౌళి సినిమా సెట్లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం యమా వేగంగా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న హీరో అల్లు అర్జున్. పుష్ప 2ని ఆగస్టులో రిలీజ్ చేయాలంటే, ఈ సమ్మర్‌లో ఆ సినిమా మీదే బన్నీ ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారు. దాంతో పాటు, నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తారని, ఆ మూవీ స్టోరీ డిస్కషన్స్, ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటారనీ టాక్.

బుచ్చిబాబు డైరక్షన్‌లో రామ్‌చరణ్ చేసే సినిమా కూడా ఈ సమ్మర్‌లోనే స్టార్ట్ అవుతుంది. అటు చిరంజీవి - హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆ పాటికే మొదలైపోతాయి. వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి సెట్స్ లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.




