Nikhil: తండ్రైన హీరో నిఖిల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య పల్లవి.. ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తన భార్య పల్లవి బుధవారం (ఫిబ్రవరి 21) పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు అందులో తెలిపాడు.

Nikhil: తండ్రైన హీరో నిఖిల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య పల్లవి.. ఫొటో వైరల్‌
Nikhil Siddhartha
Follow us
Basha Shek

|

Updated on: Feb 21, 2024 | 2:31 PM

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తన భార్య పల్లవి బుధవారం (ఫిబ్రవరి 21) పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు అందులో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్- పల్లవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో నిఖిల్‌- పల్లవిల వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అనుమతితో పెళ్లిపీటలక్కారు. కరోనా సమయంలో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇటీవలు తన సతీమణి గర్భంతో విషయాన్నిఅందరితో పంచుకున్నాడు నిఖిల్‌. అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో భార్య సీమంతం వేడుకలను గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇప్పుడు పల్లవి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో నిఖిల్ ఆనందానికి హద్దల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

నెట్టింట అభినందనలు..

సీమంతం వేడుకల్లో పల్లవి..

ఇక సినిమాల విషయానికొస్తే.. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై పర్వాలేదనిపించాయి. మళ్లీ ఇప్పుడు స్వయంభు పేరుతో మరో పాన్ ఇండియా మూవీతో మన ముందుకు వస్తున్నాడీ యంగ్ హీరో.  చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే