AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: ఎంత మారిపోయావయ్యా? త్రిషకు మద్దతు తెలిపిన మన్సూర్ అలీఖాన్.. ఆయన వ్యాఖ్యలు బాధించాయంటూ..

కొన్ని నెలల క్రితం త్రిష పై ఇలాంటి వెకిలీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్. ఈ విషయంలో చిరంజీవి, ఖుష్బూ లాంటి ప్రముఖులు సైతం మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు కూడా అతనికి మొట్టికాయలు వేసింది. దీంతో దిగొచ్చి త్రిషకు క్షమాపణ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి ఏవీ రాజు వ్యాఖ్యలను ఖండించారు.

Trisha: ఎంత మారిపోయావయ్యా? త్రిషకు మద్దతు తెలిపిన మన్సూర్ అలీఖాన్.. ఆయన వ్యాఖ్యలు బాధించాయంటూ..
Mansoor Ali Khan, Trisha
Basha Shek
|

Updated on: Feb 21, 2024 | 4:23 PM

Share

స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన చీప్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ నాయకుడి కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఏవీ రాజుపై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా త్రిషకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విశాల్, నిర్మాత అదితీ రవిచంద్రన్ ఏవీ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు సపోర్టుగా నిలిచారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం త్రిష పై ఇలాంటి వెకిలీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్. ఈ విషయంలో చిరంజీవి, ఖుష్బూ లాంటి ప్రముఖులు సైతం మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు కూడా అతనికి మొట్టికాయలు వేసింది. దీంతో దిగొచ్చి త్రిషకు క్షమాపణ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి ఏవీ రాజు వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఈ విషయంలో త్రిషకు బహిరంగంగా మద్దతు తెలిపాడు మన్సూర్‌.

త్రిషపై ఏవీ రాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మన్సూర్ అలీ ఖాన్ ఖండించాడు. తన తోటి నటీమణుల విషయంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చాలా బాధగా అనిపిస్తుందన్నాడు. ఇలాంటి నిరాధార ఆరోపణలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్నాడు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మన్సూర్ డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం మన్సూర్ కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా మన్సూర్ తన తప్పును తెలుసుకున్నాడంటూ చర్చించుకుంటున్నారు. అంతకు ముందు స్టార్ హీరో విశాల్‌ కూడా ఏవీ రాజు పేరు ప్రస్తావించకుండానే తీవ్రంగా మండిపడ్డాడు. ఇలాంటి వాళ్లకు నరకంలో కుళ్లబొడవాలంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

త్రిషకు మద్దతుగా విశాల్ ట్వీట్..

నిర్మాత అదితీ రవీంద్రనాథ్ ఆగ్రహం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us