IPL 2024: కావ్యా పాప టీంకు ఇంత కష్టమా.? ఫేజ్ 1లో హైదరాబాద్ తలబడేది ఈ జట్లతోనే.!
ఐపీఎల్ 2024 ఫేజ్ 1 షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో కేవలం 17 రోజులకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. మార్చి 22న లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెపాక్ స్టేడియం వేదికగా తలబడనున్నాయి.

ఐపీఎల్ 2024 ఫేజ్ 1 షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో కేవలం 17 రోజులకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. మార్చి 22న లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెపాక్ స్టేడియం వేదికగా తలబడనున్నాయి. ఇక తొలి విడతలో నాలుగు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ఉండగా.. డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు.. నైట్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉంటే.. గతేడాది పేలవ ఫామ్ కొనసాగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2024 తొలి విడతలో 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు హోం గ్రౌండ్.. మరో రెండు ఎవే మ్యాచ్‌లు ఉన్నాయి. హైదరాబాద్ తన లీగ్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మార్చి 27న రెండో మ్యాచ్ ఆడుతుంది సన్‌రైజర్స్. మార్చి 31న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మూడో మ్యాచ్, ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో నాలుగో మ్యాచ్ ఆడనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఏడాది మంచి ప్లేయర్స్‌ను వేలంలో కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. తొలి ఫేజ్‌లో ఈ బలమైన టీంలకు గట్టి పోటీనిస్తుందో.. లేదో.. వేచి చూడాలి.
ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనున్నారు. వారు ఈ సీజన్‌కు ప్రత్యెక ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం వేలంలో రికార్డు ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Mark your dates, #OrangeArmy 😍
We start our 🔥 days against the Knights 🧡💜
And we’ll see you at Uppal on the 27th 😍#IPL2024 #IPLSchedule pic.twitter.com/j9kuIIDyfE
— SunRisers Hyderabad (@SunRisers) February 22, 2024
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ జట్టు:
అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, వనిందు హసరంగా, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హాక్ ఫరూకీ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, ఝటావేద్ సుబ్రమణ్యం




