IPL 2024: ఢిల్లీ టూ వైజాగ్.. డీసీ తొలి రెండు హోం మ్యాచ్‌లు విశాఖలోనే.. ఎందుకో తెల్సా?
ఐపీఎల్ 2024 షెడ్యూల్ చూస్తే.. అన్ని జట్లూ కూడా తమ హోం మ్యాచ్‌లు సొంత మైదానంలో ఆడనున్నాయి. అయితే ఎందుకని ఢిల్లీ క్యాపిటల్స్.. హోం గ్రౌండ్ ఢిల్లీ నుంచి వైజాగ్‌కు షిఫ్ట్ అయింది. తొలి విడతలో రెండు హోం మ్యాచ్‌లు వైజాగ్‌లో ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. అందుకు కారణం లేకపోలేదు. అదేంటంటే..

ఐపీఎల్ 2024 తొలి విడత షెడ్యూల్ వచ్చేసింది. 17 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 4 డబుల్ హెడ్డర్ గేమ్స్ ఉండగా.. డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు.. నైట్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు జరుగుతాయి. మొదటి మ్యాచ్ మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఇంతవరకు బాగానే ఉంది. షెడ్యూల్ చూస్తే.. అన్ని జట్లూ కూడా తమ హోం మ్యాచ్‌లు సొంత మైదానంలో ఆడనున్నాయి. అయితే ఎందుకని ఢిల్లీ క్యాపిటల్స్.. హోం గ్రౌండ్ ఢిల్లీ నుంచి వైజాగ్‌కు షిఫ్ట్ అయింది. తొలి విడతలో రెండు హోం మ్యాచ్‌లు వైజాగ్‌లో ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. అందుకు కారణం లేకపోలేదు. అదేంటంటే..
ఐపీఎల్ కంటే ముందుగా డబ్ల్యూపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉమెన్స్ ఐపీఎల్‌లో సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. దాదాపుగా డబ్ల్యూపీఎల్‌కి సంబంధించి ఓ 11 మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి.
డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ ఉమెన్స్ మ్యాచ్‌లు..
𝑻𝒉𝒆 𝒘𝒂𝒊𝒕 𝒊𝒔 𝒐𝒗𝒆𝒓 🤩
Apne calendars update karlo, #WPL mein phir roar machaane ka waqt aa chuka hai 🙌💙#YehHaiNayiDilli pic.twitter.com/XyT94aVELt
— Delhi Capitals (@DelhiCapitals) January 26, 2024
ఇలా వరుస మ్యాచ్‌లు కారణంగా పిచ్ దెబ్బతినే అవకాశం ఉందని.. డీసీ యాజమాన్యం భావించడంతో.. వారి అంగీకారం మేరకు బీసీసీఐ తొలి విడత రెండు మ్యాచ్‌లు ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్ వైజాగ్ కానుంది. మార్చి 31న చెన్నైతో, ఏప్రిల్ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే రెండో విడతలో మాత్రం ఢిల్లీ తన హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలోనే మిగతా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది.
ఢిల్లీ పురుషుల టీం తొలి రెండు మ్యాచ్‌లు వైజాగ్‌లో..
First 2 Home Games 👉🏼 A new home in Vizag 🏠💙❤️#YehHaiNayiDilli #IPL2024 pic.twitter.com/wf8u4sa81C
— Delhi Capitals (@DelhiCapitals) February 22, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు:
స్వస్తిక్ చికారా, షాయ్ హోప్, సుమిత్ కుమార్, జాయ్ రిచర్డ్‌సన్, రసిఖ్ సలామ్, కుమార్ కుషాగ్రా, రికీ భుయ్, జస్టిన్ స్టబ్స్, హ్యారీ బ్రూక్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎనిగిడి, కులీదీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, విక్కీ ఓస్త్వాల్, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, యశ్ ధుల్, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్.




