- Telugu News Photo Gallery Cinema photos Rakul Preet and Jackky Bhagnani get married, see official photos
Rakul Preet Singh Wedding: చూడముచ్చటైన జంట.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి ఫొటోలు ఇదిగో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్ననీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో బుధవారం (ఫిబ్రవరి 21) ఈ ప్రేమ పక్షుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుక అనంతరం రకుల్, జాకీలు స్వయంగా తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.
Updated on: Feb 22, 2024 | 3:08 PM

Rakul Preet Singh Wedding

రకుల్, జాకీల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

రితీష్ దేశ్‌ముఖ్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, భూమి పెడ్నేకర్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానా, తాహిరా కశ్యప్‌చ అర్జున్ కపూర్, మహేష్ మంజ్రేకర్ తదితర బాలీవుడ్ స్టార్స్ రకుల్ వివాహ వేడుకలో సందడి చేశారు.

అలాగే సమంత, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జెనీలియా, అతియా, మృణాళ్ ఠాకూర్ తదితర సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రకుల్, జాకీలకు శుభాకాంక్షలు తెలిపారు.

పెళ్లి సందర్భంగా పింక్ లెహెంగా ధరించింది రకుల్. అలాగే చేతికి మ్యాచింగ్ గాజులు, మెడలో భారీ ఆభరణాలు ఈ కొత్త పెళ్లి కూతురి అందాన్ని రెట్టింపు చేశాయి.

సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న రకుల్, జాకీల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 'చూడముచ్చటైన జంట' అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




