Sachin Tendulkar: సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో సచిన్‌.. ప్రయాణికుల కేరింతలు.. వీడియో చూస్తే గూస్ బంప్స్‌

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆటకు గుడ్‌ బై చెప్పి పదేళ్లు గడిచినా సచిన్‌ పేరులో ఉన్న పవర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సచిన్ తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడుతుంటారు అభిమానులు. సచిన్‌ కోసం తన స్టేటస్ ను పక్కన పెట్టి మరీ ఫ్యాన్స్ కు రెస్పెక్ట్‌ ఇస్తాడు

Sachin Tendulkar: సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో సచిన్‌.. ప్రయాణికుల కేరింతలు.. వీడియో చూస్తే గూస్ బంప్స్‌
Sachin Tendulkar
Follow us
Basha Shek

|

Updated on: Feb 22, 2024 | 3:07 PM

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆటకు గుడ్‌ బై చెప్పి పదేళ్లు గడిచినా సచిన్‌ పేరులో ఉన్న పవర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సచిన్ తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడుతుంటారు అభిమానులు. సచిన్‌ కోసం తన స్టేటస్ ను పక్కన పెట్టి మరీ ఫ్యాన్స్ కు రెస్పెక్ట్‌ ఇస్తాడు. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. అచ్చం అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. వివరాల్లోకి వెళితే.. సచిన్ తన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. సాధారణంగా సెలబ్రిటీలంటే బిజినెస్ క్లాస్ టికెట్లు కొని జర్నీ చేస్తారు. అయితే సచిన్ అలా చేయలేదు. ఒక సామాన్యుడిగా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. అంతే అక్కడ టెండూల్కర్‌ ను చూసిన ప్రయాణికులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. సచిన్‌, సచిన్ అంటూ విమానంలో కేరింతలు కొట్టారు. దీంతో ఫ్లైట్‌ కాస్తా ఓ మినీ స్టేడియంలా మారిపోయింది. ఇక్కడే మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు టెండూల్కర్‌. తనను విష్‌ చేసిన వారికి నమస్కరిస్తూ హుందాతనాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సచిన్‌ సింప్లిసిటీకి ఇది నిదర్శనమంటూ

ఇవి కూడా చదవండి

సచిన్‌ టెండుల్కర్‌ ప్రస్తుతం ట్రావెల్‌ మూడ్‌లో ఉన్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. ‘భూతల స్వర్గం కశ్మీర్‌’ అంటూ విమానం నుంచి కశ్మీర్‌ అందాలు వీక్షిస్తున్న వీడియోను సచిన్‌ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కశ్మీర్‌ పర్యటనలో భాగంగా గూల్మార్గ్‌ ను సందర్శించారు సచిన్‌. అక్కడి యువతతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడారు మాస్టర్‌ బ్లాస్టర్. అంతర్జాతీయ క్రికెట్ వేదికలపై సెంచరీల మీద సెంచరీలు కొట్టిన సచిన్.. కశ్మీర్ కుర్రాళ్లతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడి వారిని ఖుషి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది.

విమానంలో సచిన్.. అభిమానుల కేరింతలు.. వీడియో..

కశ్మీర్ కుర్రాళ్లతో గల్లీ క్రికెట్ ఆడుతోన్న సచిన్..

కారు నిలిపి అభిమానితో మాట్లాడుతున్న సచిన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..