IND vs ENG: సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన.. రాంచీలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?

శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈఈ టెస్టు మ్యాచ్‌లో గెలిస్తే, ఇంగ్లిష్ జట్టుతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.

IND vs ENG: సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన.. రాంచీలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Feb 22, 2024 | 9:45 AM

రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను 434 పరుగుల తేడాతో ఓడించిన భారత్ ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమైంది. రాంచీలోని జెఎస్‌సిఎ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్‌ ప్రారంభించింది భారత జట్టు. శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈఈ టెస్టు మ్యాచ్‌లో గెలిస్తే, ఇంగ్లిష్ జట్టుతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఇందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తోంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమిండియా ఆటగాళ్లు బుధవారమే రాంచీకి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. బీసీసీఐ ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్ వంటి టీమిండియా యువ ఆటగాళ్లు నెట్ సెషన్‌లో చెమటోడ్చారు.

రాంచీలో భారత్ ఇప్పటి వరకు కేవలం 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఒక టెస్టులో విజయం సాధించగా మరొకటి డ్రా అయ్యింది. మార్చి 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్ లో 210 ఓవర్లలో 9 వికెట్లకు 603 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ తన కెరీర్‌ బెస్ట్ స్కోరు 212 పరుగులు కూడా ఈ గ్రౌండ్‌ లోనే చేయడం విశేషం. ఈ మైదానంలో రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా తలా సెంచరీ చేశారు. రవీంద్ర జడేజా రెండు టెస్టుల్లో రెండు అర్ధశతకాలు సాధించాడు. అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ శర్మ (6) ఉన్నాడు. అలాగే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా (12 వికెట్లు) ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు..

భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్, Mohd. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి