Virat Kohli Son Akaay: కోహ్లి, అనుష్క బేబీ 'అకాయ్‌' అంటే ఆవకాయ కాదు.. అది వేరే.!

Virat Kohli Son Akaay: కోహ్లి, అనుష్క బేబీ ‘అకాయ్‌’ అంటే ఆవకాయ కాదు.. అది వేరే.!

Anil kumar poka

|

Updated on: Feb 22, 2024 | 4:29 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మలు రెండోసారి అమ్మానాన్నలయ్యారు. ఫిబ్రవరి 15 న, భార్య అనుష్క పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ద్వారా ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. "మా హృదయాలు గొప్ప ఆనందం, ప్రేమతో నిండి ఉన్నాయి. ఫిబ్రవరి 15న మేము మా అబ్బాయి అకాయ్‌ని మా జీవితంలోకి స్వాగతించాం" అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మలు రెండోసారి అమ్మానాన్నలయ్యారు. ఫిబ్రవరి 15 న, భార్య అనుష్క పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ద్వారా ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. “మా హృదయాలు గొప్ప ఆనందం, ప్రేమతో నిండి ఉన్నాయి. ఫిబ్రవరి 15న మేము మా అబ్బాయి అకాయ్‌ని మా జీవితంలోకి స్వాగతించాం” అని విరాట్ కోహ్లీ చెప్పాడు. దీంతో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కోహ్లి, అనుష్క తమ కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టారన్న విషయం తెలియగానే చాలామంది నెటిజన్లు యాక్టివ్‌ అయ్యారు. అసలు ఈ పేరుకు అర్థమెంటో తెలుసుకోవడానికి వెంటనే గూగుల్‌ని ఆశ్రయించారు. ఈ పేరుకు రెండు అర్థాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అకాయ్‌ అనేది సంస్కృత పదం. అంటే భౌతిక శక్తికి మించిన వాడు అని అర్థం. ఈ పేరు శివుని వేయి నామాలలో ఒకటిగా చెబుతారు. ఇదే పేరు టర్కిష్‌లో కూడా ఉంది. దాని ప్రకారం ‘ప్రకాశించే చంద్రుడు’ అని అర్థం వస్తుంది. అయితే ఈ పేరుపై కొందరు ఫన్నీగా మీమ్స్‌ చేస్తున్నారు. నెట్టింట వైరల్ చేస్తూ.. కోహ్లీ కొడుకు పేరును వెరీ పాపులర్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..