Bootcut Balaraju OTT: అఫీషియల్‌.. ఆహాలో బిగ్‌ బాస్‌ సొహైల్‌ బూట్‌కట్‌ బాలరాజు.. .స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ సినిమా 'బూట్ కట్‌ బాల రాజు. శ్రీ కోనేటి తెరకెక్కించిన ఈ ఫన్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. అలాగే సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన బూట్‌ కట్‌ బాలరాజు ఆడియెన్స్ ను బాగా నవ్వించింది

Bootcut Balaraju OTT: అఫీషియల్‌.. ఆహాలో బిగ్‌ బాస్‌ సొహైల్‌ బూట్‌కట్‌ బాలరాజు.. .స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Bootcut Balaraju Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 23, 2024 | 11:54 AM

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ సినిమా ‘బూట్ కట్‌ బాల రాజు. శ్రీ కోనేటి తెరకెక్కించిన ఈ ఫన్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. అలాగే సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన బూట్‌ కట్‌ బాలరాజు ఆడియెన్స్ ను బాగా నవ్వించింది. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన బూట్ కట్‌ బాలరాజు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఈ కామెడీ ఎంటర్‌ టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బూట్ కట్‌ బాలరాజు ఓటీటీ రిలీజ్‌ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు మన ‘బూట్ కట్ బాలరాజు’ .ఇక ఊరు, వాడ, పిల్లా, జల్లా అందరూ రెడీగా ఉండుర్రి’ అంటూ ట్వీట్ చేసింది ఆహా ఓటీటీ. ఈ మేరకు సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

బూట్‌ కట్‌ బాలరాజు సినిమాను గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై స్వయంగా హీరో సోహైల్‌ నిర్మించడం విశేషం. పేద, ధనిక అంతరాలకు కాస్త కామెడీ టచ్‌ ఇచ్చి ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్‌ శ్రీ కోనేటి. అయితే థియేటర్లలో రిలీజైన తొలి నాళ్లలో బూట్ కట్‌ బాలరాజుకు పెద్దగా స్పందన రాలేదు. దీంతో బాగా ఎమోషనలయ్యాడు హీరో సొహైల్‌. ఆ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మరి థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్వించిన బూట్ కట్ బాలరాజు ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

బూట్‌కట్‌ బాలరాజు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.