Yatra 2 OTT: ఓటీటీలో ‘యాత్ర 2’.. సీఎం జగన్‌ బయోపిక్‌ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

2019లో రిలీజైన యాత్ర‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. వైఎస్సార్, జగన్ జీవితాల్లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది

Yatra 2 OTT: ఓటీటీలో 'యాత్ర 2'.. సీఎం జగన్‌ బయోపిక్‌ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Yatra 2 (6)
Follow us
Basha Shek

|

Updated on: Feb 23, 2024 | 1:14 PM

ఏపీ సీఏం వైఎస్ జ‌గ‌న్ జీవితం ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా యాత్ర2. సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా కనిపించాడు. అలాగే జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించారు. 2019లో రిలీజైన యాత్ర‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. వైఎస్సార్, జగన్ జీవితాల్లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం ఏపీలో మాత్రమే భారీ కలెక్షన్లు వచ్చాయి. తెలంగాణలో మాత్రం యాత్ర 2కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన యాత్ర 2 ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైందని టాక్‌ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ పొలిటికల్‌ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం యాత్ర 2 మేకర్స్, ఓటీటీ సంస్థ మధ్య డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నెలరోజుల తర్వాత అంటే మార్చి రెండో వారంలో యాత్ర 2 సినిమా ఓటీటీలో రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని వార్తలు వస్తున్నాయి.

త్రీ ఆటమ్న్ లీవ్స్ నిర్మించిన యాత్ర 2 సినిమాలో కేతకి నారాయణ్‌, మహేశ్ మంజ్రేకర్, సుజానే బెర్నెట్‌, శుభలేఖ సుధాకర్‌, జార్జ్ మరియన్, రాజీవ్ కుమార్ అనేజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. మధి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

యాత్ర 2 సినిమా మేకింగ్ వీడియో..

యాత్ర 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్