Eagle OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా ‘ఈగల్’.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఎప్పటిలాగే ఈ మూవీలో రవితేజ తన నటనతో అదరగొట్టేశారు.

Eagle OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా 'ఈగల్'.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
Eagle Movie OTT
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2024 | 5:03 PM

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మాస్ మాహారాజా రవితేజ. ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ.. ఆతర్వాత ‘ఈగల్’ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఎప్పటిలాగే ఈ మూవీలో రవితేజ తన నటనతో అదరగొట్టేశారు. ఇక కార్తీక్ తీసుకున్న కంటెంట్.. తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ మూవీకి ఊహించని స్థాయిలో వసూళ్లు అందించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఫిక్స్ చేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ రవితేజ ఈగల్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ రిలీజ్ చేసినట్లు సమాచారం. అయితే ఎప్పటినుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందనే విషయాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన తేదీ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా కథ విషయానికి వస్తే.. జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆమె ఓ వ్యక్తి గురించి రాసిన ఆర్టికల్ పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈగల్ నెట్ వర్క్ కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. అయితే ఈ నెట్ వర్క్ ను సహదేవ్ వర్మ (రవితేజ) నడుపుతుంటాడు. ఈ నెట్ వర్క్ మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్, నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకీ టార్గెట్ అవుతుంది. ఈ నెట్ వర్క్ మూలాలు ఏపీలోని ఓ అడవుల్లో బయటపడతాయి. ఈగల్ నెట్ వర్క్.. ఆ అడవులకు సంబంధం ఏంటీ ?.. అసలు సహదేవ్ వర్మ ఎవరు ?.. అతడి గతమేంటీ ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.