Singapore Saloon: ఓటీటీలోకి వచ్చేసిన మీనాక్షి చౌదరి సూపర్ హిట్ సినిమా.. సింగపూర్ సెలూన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వారం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది సింగపూర్ సెలూన్. గోకుల్ తెరకెక్కించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించడం విశేషం. జనవరి 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ తమిళ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది
శుక్రవారం కావడంతో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. వివిధ భాషల్లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మూవీస్, సిరీస్‌లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. అలా ఈ వారం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది సింగపూర్ సెలూన్. గోకుల్ తెరకెక్కించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించడం విశేషం. జనవరి 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ తమిళ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదట తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సింగపూర్ సెలూన్ సినిమా ఏకంగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం (ఫిబ్రవరి 23) అర్ధ రాత్రి నుంచి సింగపూర్ సెలూన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతానికి కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేయవచ్చు.
సింగపూర్ సెలూన్ ఆర్‌జే బాలాజీ హీరోగా నటించాడు. సత్యరాజ్, లాల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. అతనితో పాటు అరవింద్ స్వామి, యాత్ర 2 హీరో జీవా కూడా అతిథి పాత్రల్లో మెరవడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాలని, తన వ్యాపారాన్ని విస్తరించాలని కలలు కంటుంటాడు హీరో ఆర్జే బాలాజీ. బీటెక్ చదివిన అతను ఎందుకు సెలూన్ వృత్తిని ఎంచుకున్నాడు? గొప్పింటికి చెందిన అమ్మాయి మీనాక్షి ఎందుకు లవ్ చేసింది? ఈ నేపథ్యంలో హీరో పడ్డ కష్టాలు, ఎమోషన్స్, కామెడీ వంటి అంశాలతో సాగుతుంది సింగపూర్ సెలూన్. వీకెండ్ లో మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ కావాలనుకునే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
#SingaporeSaloon streaming now on @PrimeVideoIN ❤️ pic.twitter.com/ZGHRuzqO1d
— RJ Balaji (@RJ_Balaji) February 23, 2024
త్వరలో తెలుగులోనూ స్ట్రీమింగ్..
Watch #SingaporeSaloon starring @RJ_Balaji which is now available in your home to inspire all ! Hey I’m watching Singapore Saloon. Check it out now on Prime Video!https://t.co/BltP63DRRa
Movie Now streaming on @PrimeVideoIN!!
Dir by @DirectorGokul, Prod by @VelsFilmIntl pic.twitter.com/m4fCsjcE9S
— jayachandhiran (@imjaiindian) February 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.