Bhamakalapam 2: OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్ క్రియేట్.
దిగ్గజ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం 2’ ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. మీడియా, పబ్లిక్‌కి వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియమణి నటనకు ప్రత్యేక విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
దిగ్గజ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం 2’ ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. మీడియా, పబ్లిక్‌కి వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియమణి నటనకు ప్రత్యేక విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు భామా కలాపం 2 ప్రపంచవ్యాప్తంగా ఆదరణను దక్కించుకుంటోంది. భామా కలాపం 2 ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్, మరీ ముఖ్యంగా గృహిణులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫేవరెట్‌గా మారింది. ఆహాలో “భామాకలాపం 2” రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. 5 రోజుల్లోనే మిలియన్ మంది వీక్షించారు. ఇక మున్ముందు కూడా భామా కలాపం హాట్ ఫేవరేట్‌గా మారి టాప్‌లో ట్రెండ్ కానుంది. ‘భామాకలాపం 2’కి వచ్చిన స్పందన, ప్రేక్షకుల ప్రేమను చూసిన తర్వాత.. భామాకలాపం 3 త్వరలో రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. భామాకలాపం తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..