Trisha - Aiadmk: యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.

Trisha – Aiadmk: యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.

Anil kumar poka

|

Updated on: Feb 23, 2024 | 9:28 AM

అన్నాడీఎంకే మాజీ నేత అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే ట్విట్టర్లో రియాక్టైన త్రిష.. ఇప్పుడు లీగల్ యాక్షన్‌ కు దిగారు. మాజీ ఎమ్మెల్యేకి లీగల్ నోటీసులు పంపించారు. మాజీ ఎమ్మెల్యే రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకుంటే పరువునష్టం దావా వేస్తానని నోటీసుల్లో పేర్కొన్నారు. మొక్కుబడి క్షమాపణ సరిపోదంటూ ఫైర్ అయ్యారు. అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ MLA రాజు.. ఇటీవల త్రిషను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు.

అన్నాడీఎంకే మాజీ నేత అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే ట్విట్టర్లో రియాక్టైన త్రిష.. ఇప్పుడు లీగల్ యాక్షన్‌ కు దిగారు. మాజీ ఎమ్మెల్యేకి లీగల్ నోటీసులు పంపించారు. మాజీ ఎమ్మెల్యే రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకుంటే పరువునష్టం దావా వేస్తానని నోటీసుల్లో పేర్కొన్నారు. మొక్కుబడి క్షమాపణ సరిపోదంటూ ఫైర్ అయ్యారు. అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ MLA రాజు.. ఇటీవల త్రిషను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్‌ పెట్టినప్పుడు త్రిషను తీసుకొచ్చారని, పారితోషికం కింద 25లక్షలు ఇచ్చారని అన్నారు. డ్యాన్స్‌ పార్టీ, విందు కోసమే త్రిషని తీసుకొచ్చారని చెప్పారు. కువతూర్‌ రిసార్ట్‌లో త్రిషతో ప్రముఖులు డ్యాన్స్‌ పార్టీ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ మాటలపట్ల అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. త్రిష ట్విట్టర్‌లో ఇప్పటికే రాజును కడిగి పారేశారు. అటెన్షన్ కోసం దిగజారి మాట్లాడే వాళ్లను చూస్తే అసహ్యం వేస్తోందంటూ కామెంట్‌ చేశారు.. ఇక ఇవాళ లీగల్‌ నోటీసులు పంపారు. రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే పరువునష్టం దావా వేస్తానని త్రిష నోటీసులు ఇచ్చారు. త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్‌ అనుచిత వ్యాఖ్యల వివాదం ఇంకా మర్చిపోక ముందే.. పొలిటీషియన్‌ విమర్శలు చేయడం తమిళనాట చర్చనీయాంశమైంది. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని.. వారిని కఠినంగా శిక్షించాలని ఇండస్ట్రీ ప్రముఖులంతా డిమాండ్‌ చేశారు. త్రిషకు మద్దతుగా నిలిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 23, 2024 09:27 AM