Meenakshi Chaudhary: బాపు బొమ్మ అందానికే ఈ ముద్దుగుమ్మ ప్రతిరూపం.. చిరునవ్వు సంకెళ్లతో హృదయాలను బంధిస్తోన్న మీనాక్షి..
గతేడాది తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించిన పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ రాలేదు. ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ జోడిగా చేసిన ఖిలాడి సైతం నిరాశపరిచింది. కానీ ఇందులో మీనాక్షి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ భామకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అడివి శేష్ నటించిన హిట్ ది సెకండ్ కేస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మీనాక్షి.

Meenakshi Chaudhary
- గతేడాది తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించిన పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ రాలేదు.
- ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ జోడిగా చేసిన ఖిలాడి సైతం నిరాశపరిచింది. కానీ ఇందులో మీనాక్షి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ భామకు గుర్తింపు వచ్చింది.
- ఆ తర్వాత అడివి శేష్ నటించిన హిట్ ది సెకండ్ కేస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మీనాక్షి. ఈ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది.
- ఈ సినిమా ఎఫెక్ట్.. వెంటనే గురూజీ తెరకెక్కించిన గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. కానీ ఈ బ్యూటీది కేవలం అతిథి పాత్ర అని చెప్పొచ్చు. కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే కనిపించింది. అయినా అందరి చూపును తనవైపు తిప్పుకుంది.
- ప్రస్తుతం మట్కా, విజయ్ దళపతి సినిమాల్లో నటిస్తుంది ఈ హర్యానా బ్యూటీ. మరోవైపు సోషల్ మీడియాలో వరుసగా ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.









