- Telugu News Photo Gallery Cinema photos Bollywood hero Riteish Deshmukh, who has become a director has selected a Telugu subject for film
Riteish Deshmukh: తెలుగు సబ్జెక్ట్‌నే సెలెక్ట్ చేసుకున్న రితేష్.. ఏంటా సబ్జెక్ట్.?
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ అంటే మన ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం లేకపోయినా... మన హాసిని భర్త రితేష్ అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు ఆడియన్స్. రీసెంట్ దర్శకుడిగా మారిన ఈ బాలీవుడ్ హీరో అందుకోసం ఓ తెలుగు సబ్జెక్ట్‌నే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు రితేష్.
Updated on: Feb 24, 2024 | 6:22 PM

రీసెంట్‌గా వేద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలీవుడ్ హాట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనిలియా. సౌత్‌లో సూపర్ హిట్ అయిన మజిలి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా నార్త్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది. ఈ మూవీతో తొలిసారిగా మెగాఫోన్ పట్టిన రితేష్, ఫస్ట్ అటెంప్ట్‌లోనే సూపర్ హిట్ అందుకొని సత్తా చాటారు.

వేద్ సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఓ మెగా ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు రితేష్. తాజాగా ఆయన తర్వాత చేయబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు.

సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఓ హిస్టిరికల్ మూవీని ఎనౌన్స్ చేశారు రితేష్. రాజా శివాజీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించటంతో పాటు స్వయంగా దర్శకత్వం కూడా వహించబోతున్నారు.

చాలా కాలంగా శివాజీ కథతో సినిమా చేయాలన్నది రితేష్ కోరిక. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు రితేష్. రీసెంట్ టైమ్స్‌లో ఛత్రపతి కథతో వచ్చిన సినిమాల్లో శరద్ కేల్కర్ శివాజీగా నటించారు. ఓ మరాఠి సినిమా కోసం త్వరలో అక్షయ్ కూడా ఆ పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పుడు రితేష్ శివాజీ పాత్రనే సెలెక్ట్ చేసుకోవటం, ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద ఈ జానర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రితేష్ డైరెక్టోరియల్ ఛాయిస్ మీద ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.




