Telugu Films: ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్స్ కళ.. హీరోలంతా ఎక్కడెక్కడున్నారంటే.?
చిరంజీవి ఉన్నా లేకపోయినా విశ్వంభర షూటింగ్ మాత్రం ఆగట్లేదు.. రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత గేమ్ ఛేంజర్ సెట్‌లో అడుగు పెట్టారు.. చిన్న బ్రేక్ తీసుకున్న బాలయ్య మళ్లీ సెట్‌కు వచ్చారు.. సంక్రాంతి హీరోలైతే ఇంకా షూటింగ్‌కు రావట్లేదు. ఇలా ఒక్కొక్కరి గురించి ఎందుకు గానీ.. అసలు మన హీరోలంతా ఎక్కడెక్కడున్నారో చూద్దాం పదండి.. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్స్ కళ కనిపిస్తుంది. సంక్రాంతి హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజులు షూటింగ్‌కు రానట్లే.