AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌ తల్లికి ఆపరేషన్‌.. అందరూ ప్రార్థించాలంటూ రిక్వెస్ట్‌.. అసలు ఏమైందంటే?

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది పాయల్‌ రాజ్‌ పుత్. తన లేటెస్ట్ గ్లామర్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్, వీడియోలను తరచూ అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన ప్రొఫెషనల్‌ విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ షేర్ చేసింది పాయల్‌. ఇటీవలే తన తల్లికి మోకాళ్ల ఆపరేషన్ జరిగింది.

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌ తల్లికి ఆపరేషన్‌.. అందరూ ప్రార్థించాలంటూ రిక్వెస్ట్‌.. అసలు ఏమైందంటే?
Payal Rajput
Basha Shek
|

Updated on: Feb 23, 2024 | 2:11 PM

Share

మంగళవార సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది హాట్‌ బ్యూటీ పాయల్ రాజ్‌ పుత్‌. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. అన్నిటికీ మించి ఆర్‌ ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి హిట్‌ లేని పాయల్‌ కు మంచి సాలిడ్‌ హిట్‌ లభించింది. ఈ సినిమా విజయంలో పాయల్‌కు మళ్లీ డిమాండ్ పెరిగింది. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది పాయల్‌ రాజ్‌ పుత్. తన లేటెస్ట్ గ్లామర్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్, వీడియోలను తరచూ అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన ప్రొఫెషనల్‌ విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ షేర్ చేసింది పాయల్‌. ఇటీవలే తన తల్లికి మోకాళ్ల ఆపరేషన్ జరిగింది. ఈ సర్జరీ చాలా పెయిన్ ఫుల్‌గా ఉందని, అయినా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని, అమ్మ నడుస్తోందంటూ ఎమోషనలైందీ అందాల తార. అలాగే తన అభిమానులందరూ కూడా అమ్మ గురించి ప్రార్థించండంటూ ఇన్ స్టా స్టోరీస్ వేదికగా అభ్యర్థించిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఆపరేషన్ అనంతరం అమ్మ ఎలా నడుస్తుందో కూడా చూపిస్తూ ఇన్ స్టా స్టోరీస్‌ లో షార్ట్‌ వీడియోను షేర్‌ చేసింది పాయల్‌. వీటిని చూస్తుంటే సర్జరీ తర్వాత తల్లి పక్కనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది పాయల్‌.

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఒక్క సారి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది పాయల్‌ రాజ్‌ పుత్‌. అయితే వన్‌ ఫిల్మ్ వన్‌ వండర్‌ లా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత పాయల్‌ చేసిన సినిమాలన్నీబోల్తా కొట్టాయి. ఆర్‌డీఎక్స్‌ లవ్, వెంకీమామా, డిస్కోరాజా, జిన్నా తదితర సినిమాలు నిరాశపర్చాయి. అనగనగా ఓ అతిథి, 3 రోజెస్‌ వంటి ఓటీటీ సినిమాలు, సిరీస్‌లతో అదృష్టం పరీక్షించుకున్నా సక్సెస్‌ మాత్రం రాలేదు. కెరీర్‌ గందరగోళంగా కొనసాగుతున్న తరుణంలోనే మరోసారి ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ పాయల్‌కు మరో మూవీ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది పాప.

ఇవి కూడా చదవండి

ప్రియుడి తల బద్దలు కొట్టిన పాయల్ … వీడియో

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పుత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.